AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Scheme: రైతులకు భారీ గుడ్‌న్యూస్.. నెలనెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ప్రతిఒక్కరికీ..

ఉద్యోగులే కాదు.. రైతులు కూడా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఓ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. ఈ పథకంలో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. రైతులు కొంతమెత్తంలో ప్రీమియం చెల్లిస్తే.. ప్రభుత్వం మిగతా ప్రీమియం చెల్లిస్తుంది.

Farmers Scheme: రైతులకు భారీ గుడ్‌న్యూస్.. నెలనెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ప్రతిఒక్కరికీ..
Farmers
Venkatrao Lella
|

Updated on: Feb 16, 2026 | 7:36 AM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నగదుతో పాటు నెలనెలా పెన్షన్ వస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ద్వారా 58 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. కానీ రైతులు వృద్దాప్యంలోకి వచ్చాక పని చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు రోజువారీ ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఉద్యోగుల తరహాలో రైతులకు కూడా వృద్దాప్యంలోకి చేరుకున్నాక పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో కేంద్రం దీనిని తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఈ పథకం గురించి చాలామంది రైతులకు తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ స్కీమ్ పేరే ప్రధానమంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన. అసలు ఈ పథకంలో ఎలా చేరాలి..? అర్హతలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హతలు ఏంటంటే..?

-వయస్సు 18 నుంచి 40 సంత్సరాల మధ్య ఉండాలి

-ప్రభుత్వ భూ రికార్డుల్లో పేరు నమోదై ఉండాలి

-2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి

-చిన్న, సన్నకారుల రైతులు అయి ఉండాలి

వీరికి అర్హత లేదు

-ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్స్ అయిన ఈపీఎఫ్‌వో, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్‌ఐ, ఇతర చట్టబద్దమైన పెన్షన్ స్కీమ్స్‌లో ఉన్నవారు అనర్హులు

-ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు అనర్హులు

కావాల్సిన డాక్యుమెంట్స్

-పాస్‌పోర్ట్ సైజు ఫొటో

-ఆధార్ కార్డ్

-బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్

-ఇన్‌కమ్ సర్టిఫికేట్

-సాగు భూమి ధ్రువీకరణ పత్రం

-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్

-ఇండి అడ్రస్ ప్రూఫ్

ఎలా చేరాలంటే..?

-సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ లేదా మీ సేవ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు

-పీఎం కిసాన్ కేఎవై పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

-దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి నిర్ధారిస్తారు

-పీఎం కిసాన్ పథకంతో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లించాలి

-40 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది

-60 ఏళ్ల తర్వాత నెలనెలా రూ.3 వేల పెన్షన్ పొందవచ్చు

-లబ్దిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ సొమ్ము అందుతుంది

-60 ఏళ్లు నిండిన తర్వాత మరణిస్తే జీవిత భాగస్వామికి సగం ఫించన్ వస్తుంది

-రైతులు స్వచ్చంధంగా ఈ పథకంలో చేరవచ్చు

-వయస్సును బట్టి ప్రీమియం ప్రతీ నెలా రూ.50 నుంచి రూ.220 వరకు ఉంటుంది

-మీరు ఎంత ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం అంత బీమా కంపెనీకి చెల్లిస్తుంది

బస్సును ఎవరు కనిపెట్టారు.. ఆ మూడు అక్షరాల వెనుక ఉన్న రహస్యం ఏంటో
బస్సును ఎవరు కనిపెట్టారు.. ఆ మూడు అక్షరాల వెనుక ఉన్న రహస్యం ఏంటో
బీచ్ ఫెస్ట్.. ఎంటర్ టైన్ మెంట్ అదిరింది!
బీచ్ ఫెస్ట్.. ఎంటర్ టైన్ మెంట్ అదిరింది!
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ చక్కర్లు కొట్టిన బిల్‌గేట్స్ విమానం
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ చక్కర్లు కొట్టిన బిల్‌గేట్స్ విమానం
పాకిస్తాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ కానుందా..?
పాకిస్తాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ కానుందా..?
వాట్సప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండిలా.. సెకన్లలోనే..
వాట్సప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండిలా.. సెకన్లలోనే..
అందం కోసం అదరిపోయే చిట్కా.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..
అందం కోసం అదరిపోయే చిట్కా.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..
శివనామస్మరణతో మారుమోగుతున్న గోదావరి తీరం వీడియో
శివనామస్మరణతో మారుమోగుతున్న గోదావరి తీరం వీడియో
మీ ఫోన్‌తో బంగారం, వెండి స్వచ్ఛతను తనిఖీ చేయండి ఇలా..!
మీ ఫోన్‌తో బంగారం, వెండి స్వచ్ఛతను తనిఖీ చేయండి ఇలా..!
అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు
అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు
శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..? ఈ ఆయుర్వేద..
శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..? ఈ ఆయుర్వేద..