PM Kisan:ఈ తప్పులు చేసినవారికి పీఎం కిసాన్ కట్.. రైతులకు కేంద్రం అలర్ట్.. మళ్లీ ఏం చేయాలంటే..?
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నగదు జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి తొలివారంలో పడే అవకాశముంది. అయితే కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు జమ కాకపోతే టెన్షన్ పడకండి. చిన్న చిన్న తప్పుల వల్ల నగదు పడకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేాయాలంటే..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీ ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. ఏడాదిలో మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి వీటిని జమ చేస్తోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రధాని మోదీ తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో 21వ విడత నగదును జమ చేయగా.. 22వ విడత డబ్బులను ఫిబ్రవరి చివరివారంలో లేదా మార్చి తొలివారంలో ప్రభుత్వం జమ చేయనుందని సమాచారం. లబ్దిదారుల అకౌంట్లో రూ.2 వేలు ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేసే అవకాశముంది. దీంతో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పీఎం కిసాన్ నిధులు ఆగిపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కారణాలు ఇవే..
-ఈకేవైసీ పూర్తి చేయకపోవడం -బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం -బ్యాంక్ అకౌంట్-ఆధార్ అనుసంధానం కాకపోవడం -ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకోకపోవడం -ఒకే ఆధార్ కార్డుతో ఇద్దరి పట్టాదారు పాస్ పుస్తకాలు లింక్ అయి ఉండటం -పట్టాదారు పాస్‌బుక్‌లో సమస్యలు ఉండటం -మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోవడం -ఐటీ రిటర్న్స్‌తో లోన్ తీసుకోకపోవడం -ఆధార్ కార్డులో తప్పులు -భూమలు వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో సరిగ్గా లేకపోవడం
ఏం చేయాలి..?
మీరు లబ్దిదారుల జాబితాలో ఉండి పీఎం కిసాన్ నగదు జమకాకపోతే పై కారణాలు కావొచ్చు. ఇలాంటి సమయంలో మీ మండలంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించండి. వారి ద్వారా జామ కాకపోవడానికి రీజన్ ఏంటనేది తెలుసుకోండి. అనంతరం మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌ను సమర్పించి సమస్యను పరిష్కరించుకోండి. ఒకవేళ ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉండి రాకపోతే వెంటనే మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండి. ఇక మీ భూముల వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో కరెక్ట్‌గా ఉన్నాయో.. లేదో చూసుకోండి. అలాగే అప్డేటెడ్ మొబైల్ నెంబర్ అందించండి. ఒక బ్యాంక్‌కు వెళ్లి ఆధార్ నెంబర్‌తో కేవైసీ పూర్తి చేసుకోండి. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో మీ వివరాలు ఉన్నాయో.. లేవో చూసుకోండి. లేకపోతే ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇవన్నీ చేస్తే మీకు త్వరలో విడుదల చేయనున్న పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో తప్పనిసరిగా పడతాయి. ఆగిపోయిన నగదు కూడా ఒకేసారి మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. దీంతో పీఎం కిసాన్ నగదు పడలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
