AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు.. భయాందోళనలో కార్మికులు

మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి మంటలు. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండగా.. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు.

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు.. భయాందోళనలో కార్మికులు
Bhopal Factory Fire
Anand T
|

Updated on: Feb 15, 2026 | 8:03 PM

Share

మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలో ఉన్న ఓ ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఎక్కువ మొత్తం ప్టాస్టిక్ సామాగ్రి ఉండడంతో కొన్ని క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. గమనించిన కార్మికులు భయంతో వెంటనే ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలుతో పాటు పొగ ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రాంతాలు మొత్తం పొగ మయంగా మారిపోయి.

ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటల తరబడి మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్, చెక్క వస్తువులు కావడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారింది. ఈ ప్రమాద ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా? ప్రాణనష్టం జరిగిందా? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.