AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder Booking: సెకన్లలోనే వాట్సప్‌లో గ్యాస్ బుకింగ్.. జస్ట్ హాయ్ అని మెస్సేజ్ పెడితే చాలు.. ఎలానో చూడండి

వాట్సప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గ్యాస్ కంపెనీలన్నీ వాట్సప్ నెంబర్లను తీసుకొచ్చాయి. ఈ వాట్సప్ నెంబర్లకు హాయ్ అని మెస్సేజ్ చేయడం ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. జస్ట్ సెకన్లలోనే గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం దీని ద్వారా పొందవచ్చు.

Gas Cylinder Booking: సెకన్లలోనే వాట్సప్‌లో గ్యాస్ బుకింగ్.. జస్ట్ హాయ్ అని మెస్సేజ్ పెడితే చాలు.. ఎలానో చూడండి
సిలిండర్ ఖాళీ భాగంలో నీళ్లు త్వరగా ఎండిపోతుంది. అయితే గ్యాస్ నిండిన భాగం చల్లగా ఉండటం వలన అక్కడ తేమ ఎండిపోవడానికి సమయం పడుతుంది. ఆ భాగంలో తేమ మొత్తం మిగిలిన గ్యాస్ మొత్తానికి సమానం అని భావించాలి.
Venkatrao Lella
|

Updated on: Feb 16, 2026 | 8:06 AM

Share

ఇంట్లోని కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి. ఇది లేకపోతే కిచెన్‌లో ఏ పని కూడా జరగదు. ఏది వండాలన్నా గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోతే చలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే చాలామంది రెండు సిలిండర్లను ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకదానిలో గ్యాస్ అయిపోగానే.. వెంటనే బుకింగ్ చేసి రెండోదానికి స్టాక్‌గా ఉంచుకుంటారు. గ్యాస్ అయిపోనప్పుడు వెంటనే దీనిని వాడుకోవచ్చు. అయితే ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉన్నవారు మాత్రం గ్యాస్ అయిపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే బుకింగ్ చేయగానే గ్యాస్ ఇంటికి రాదు. రెండు లేదా మూడు రోజుల వరకు సమయం పడుతుంది. ఇలాంటప్పుడు ఇంట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక కొన్ని సమయాల్లో గ్యాస్ వెంటనే బుక్ కాదు. గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్‌ను వెతికి కాల్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ కనెక్ట్ కాక బుకింగ్ అవ్వదు.

వాట్సప్ సేవలు

గ్యాస్ వినియోగదారుల కోసం కంపెనీలు వాట్సప్ సేవలను అందిస్తున్నాయి. జస్ట్ వాట్సప్‌ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేస్తే చాలు.. పేమెంట్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఫోన్ నెంబర్ వెతికి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వాట్సప్ ఫీచర్ వల్ల సెకన్లలోనే గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని గ్యాస్ కంపెనీలు ఈ వాట్సప్ మెస్సేజ్ గ్యాస్ బుకింగ్ ఫెసిలిటీ అందిస్తున్నాయి. ఆయా గ్యాస్ కంపెనీల వాట్సప్ నెంబర్‌కు మెస్సేజ్ చేయడం ద్వారా సులువుగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

వాట్సప్ నెంబర్లు ఇవే..

-భారత్​ గ్యాస్​(Bharat Gas) – 1800224344

-ఇండేన్​ గ్యాస్​ (Indane Gas) – 7588888824

-హెచ్‌పీ గ్యాస్​(HP Gas) – 9222201122

ఎలా బుక్ చేసుకోవాలంటే..?

-మొబైల్‌లో మీ గ్యాస్ కంపెనీ నెంబర్‌ను సేవ్ చేసుకోండి

-వాట్సప్ ఓపెన్ చేసి గ్యాస్ కంపెనీల వాట్సప్ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి

-మీ లాంగ్వేజ్‌ను ఎంచుకోండి

-మోనూలో గ్యాస్ రీఫిల్ ఆప్షన్ ఎంచుకోండి

-ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయండి

-ఆఫ్‌లైన్ ద్వారా అయితే క్యాష్ ఆన్ డెలివరీ సెలక్ట్ చేసుకోండి

-గ్యాస్ కనెక్షన్‌తో బుక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే వాట్సప్ మెస్సేజ్ పెట్టాలి

Follow Us