నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. మధ్య పశ్చిమ నేపాల్‌లోని డాంగ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు సహా కనీసం 12 మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. శుక్రవారం అర్థరాత్రి భాలుబాంగ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వ్ వారిలో ఎనిమిది మందిని మాత్రమే గుర్తించినట్లు వెల్లడించారు.
ఓ ప్యాసింజర్ బస్సు నేపాల్ గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా.. రప్తి నది మీద వంతెన మీద నుంచి నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12మంది మరణించగా.. 22 మంది ప్రయాణీకులకు గాయాలు అయినట్లు భాలుబాంగ్‌లోని ఏరియా చీఫ్ ఇన్స్పెక్టర్ ఉజ్వల్ బహదూర్ సింగ్ చెప్పారు. అయితే ఈ మృతుల్లో ఇద్దరు భారతీయుల్ని.. మరో ఎనిమిది మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
మృతులు బీహార్‌కు చెందిన మలాహికి చెందిన యోగేంద్ర రామ్ (67), ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునే (31)గా గుర్తించారు. “మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం లామాహి ఆసుపత్రికి తరలించారు” అని చీఫ్ ఇన్‌స్పెక్టర్ జోడించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..