AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మీకు పెళ్లయ్యిందా? అక్కడికి వెళితే ఫుడ్, హోమ్ అన్నీ ఫ్రీ! డబ్బు సంపాదించే మార్గమూ చెబుతారు.. కండీషన్స్ అప్లై!

ఐర్లాండ్‌లోని అత్యంత సుందరమైన గ్రేట్ బ్లాస్కెట్ ద్వీపం పర్యాటకులకు ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ద్వీపంలో ఎన్నో బీచ్‌లు,  అద్భుతమైన ప్రకృతి అందాలున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం ముఖ్యంగా వేసవి కాలంలో మిలియన్ల మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. అయితే ఇలా పర్యాటకులు పోటెత్తిన సమయంలో వారికి సర్వ్ చేయడం కొంచెం కష్టమైన పనిగా మారుతుంది అక్కడ హోటల్ సిబ్బందికి. దీంతో ఇప్పుడు సరికొత్త ప్రపోజల్ తో ముందుకు వచ్చింది. 

Viral News: మీకు పెళ్లయ్యిందా? అక్కడికి వెళితే ఫుడ్, హోమ్ అన్నీ ఫ్రీ! డబ్బు సంపాదించే మార్గమూ చెబుతారు..  కండీషన్స్ అప్లై!
Great Blasket Island
Surya Kala
|

Updated on: Jan 13, 2024 | 6:35 PM

Share

ప్రతి ఒక్కరూ ప్రయాణాలను ఇష్టపడతారు.. కొంతమంది తమ సమీపంలోని ప్రాంతాలను చూస్తే , మరికొందరు దేశంలోని అందమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే విదేశాలకు వెళ్లి అందమైన ప్రాంతాలను ముఖ్యంగా బీచ్ లను చూడలని ఉన్నా ఆర్ధిక పరిస్థితిని బట్టి తమ కోరికను చంపుకుంటారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. అందమైన బీచ్ లో ఎంజాయ్  చేయాలనే కోరిక ఉన్నవారైతే  ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే తమ ప్రదేశానికి రండి అందమైన ప్రాంతాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయండి అంటూ ఓ దేశంలోని ద్వీప వాసులు పిలుస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే.. అన్ని ఏర్పాట్లు ఉచితంగానే ఇస్తారు. ఎటువంటి సమస్యా ఉండదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు మీతో పాటు భాగస్వామిని కూడా తప్పని సరిగా తీసుకుని వెళ్ళాలి.

ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం.. ఐర్లాండ్‌లోని అత్యంత సుందరమైన గ్రేట్ బ్లాస్కెట్ ద్వీపం పర్యాటకులకు ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ద్వీపంలో ఎన్నో బీచ్‌లు,  అద్భుతమైన ప్రకృతి అందాలున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం ముఖ్యంగా వేసవి కాలంలో మిలియన్ల మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. అయితే ఇలా పర్యాటకులు పోటెత్తిన సమయంలో వారికి సర్వ్ చేయడం కొంచెం కష్టమైన పనిగా మారుతుంది అక్కడ హోటల్ సిబ్బందికి. దీంతో ఇప్పుడు సరికొత్త ప్రపోజల్ తో ముందుకు వచ్చింది.

జంటగా వెళ్లే వారు ఏమి చెయ్యాలంటే..

ఈ ద్వీపానికి వచ్చే పర్యాటకులకు టీ , కాఫీలు అందించడం.. వారి అవసరాలను గమనిస్తూ తీర్చడం. ఇలా చేసినందుకు  జీతం కూడా ఇస్తారు. అంతేకాదు. ఈ జంటలకు తమ షాప్ పైన ఉండే అపార్ట్మెంట్లో ఉచిత వసతి కల్పిస్తారు. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మీడియా నివేదికల ప్రకారం ఈ ఆఫర్ 2024 ఏప్రిల్ నుండి అక్టోబర్ 2024 వరకు నడుస్తుంది ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టులలో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ద్వీపానికి చెందిన వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఆఫర్‌లు ఉద్యోగం కోసం చూస్తున్న వారి కోసం. అనుభవం ఉన్న వారికే ఇక్కడ తొలి ప్రాధాన్యత.. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దంపతులిద్దరికీ ఇంగ్లీషు మాట్లాడడం వచ్చి ఉండాలి. అంతేకాదు ఈ ఉద్యోగానికి ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే.. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరు. ఉద్యోగార్ధుల వయస్సు 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..