optical illusion: ఆకులో ఆకై దాగి ఉన్న పాము.. దమ్ముంటే కనిపెట్టండి అంటోంది. కనిపించిందా.?

ఇక సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే కంటెంట్‌ దీనికి ఆదరణ పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇలా సోషల్‌ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకునే కంటెంట్‌లో పజిల్స్‌ ఒకటి. మరీ ముఖ్యంగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు ఇటీవల నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి...

optical illusion: ఆకులో ఆకై దాగి ఉన్న పాము.. దమ్ముంటే కనిపెట్టండి అంటోంది. కనిపించిందా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2024 | 8:41 PM

ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్నీ, ఎమోషనల్‌ ఇలా అన్ని రకాల కంటెంట్‌కు సోషల్‌ మీడియా పెట్టింది పేరు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతుంది. అందుకే సోషల్‌ మీడియాకు రోరోజుకీ ఆదరణ పెరగుగుతోంది. స్కూల్‌కు వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగి వరకు రోజంగా సోషల్‌ మీడియాలో గంటలకొద్దీ గడిపేస్తున్నారు.

ఇక సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే కంటెంట్‌ దీనికి ఆదరణ పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇలా సోషల్‌ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకునే కంటెంట్‌లో పజిల్స్‌ ఒకటి. మరీ ముఖ్యంగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు ఇటీవల నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఓ ఫొటోను పోస్ట్ చేసి అందులో విభిన్నంగా ఉన్న వస్తువును గుర్తించమని లేదా ఆ ఫొటోలో దాగి ఉన్న ఇతర వస్తువలను గుర్తించండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.

Optical Illusion

ఇలాంటి ఎన్నో పజిల్‌ పిక్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పైన ఉన్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఏముంది.. ఏదో అటవీ ప్రాంతంలో ఎండి ఆకులు, చిన్న చిన్న కర్రలు కనిపిస్తున్నాయి అంటారు కదూ! అయితే జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫొటోలో ఓ ప్రమాదకర పాము ఉంది. దమ్ముంటే నన్ను కనిపెట్టండి అంటూ సవాల్‌ విసురుతోంది.

Optical Illusions

ఈ ఆకుల మధ్య ఉన్న పామును గుర్తించడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీకు పాము కనిపించిందా.? అయితే ఓ సారి ఫొటో మధ్యలో తీక్షణంగా గమనించండి అచ్చంగా ఆకు కలర్‌లో ఉన్న సన్నని పాము కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా పామును కనిపెట్టలేకపోతే. సమాధానం కోసం ఓసారి కింద ఫొటోను చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..