Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artemis I – NASA: మనిషికి మరో ఆవాసం.. భూమికి ప్రత్యామ్నాయంగా జాబిల్లి..! రేపే నాసా ఆర్టెమిస్‌-1 ప్రయోగం..

చందమామపై కాలుమోపడమే కాదు.. అక్కడ ఇళ్లు కట్టుకోవాలని.. చందమామ కేంద్రంగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలని మానివుడి ఆకాంక్ష.! ఆ కలలు నిజమయ్యేలా.. చంద్రుడిపైకి నాసా ప్రయోగాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపైకి ఆర్టెమిస్‌-1ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది.

Artemis I - NASA: మనిషికి మరో ఆవాసం.. భూమికి ప్రత్యామ్నాయంగా జాబిల్లి..! రేపే నాసా ఆర్టెమిస్‌-1 ప్రయోగం..
Artemis I Nasa
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 15, 2022 | 5:34 AM

Artemis I Moon Mission: మనిషికి చంద్రుడు దగ్గరివాడు.. అందుకే.. చందమామ అని ఆప్యాయంగా పిల్చుకుంటాం. చంద్రుడు మనిషికి చిక్కితే.. ఇక అక్కడ నుంచి మనిషి అంతరిక్ష ప్రయాణానికి.. పరిశోధనలకు తలుపులు తెరుచుకుంటాయి. అందుకే.. శతాబ్ధాలుగా మానవుడు జాబిల్లిలో.. ఏముందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఆ ఆరాటం.. ఆ శాస్త్రీయ పోరాటం.. నిరంతర శోధనకు, అన్వేషణకు దారితీసింది. చందమామపై కాలుమోపడమే కాదు.. అక్కడ ఇళ్లు కట్టుకోవాలని.. చందమామ కేంద్రంగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలని మానివుడి ఆకాంక్ష.! ఆ కలలు నిజమయ్యేలా.. చంద్రుడిపైకి నాసా ప్రయోగాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపైకి ఆర్టెమిస్‌-1ను ప్రయోగించేందుకు నాసా (NASA) సిద్ధమైంది. కేప్ కెనావెరల్ నుంచి జాబిల్లిపైకి పంపేందుకు నాసా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టెమిస్‌-1 మూన్ రాకెట్ (Artemis I Moon Rocket) బుధవారం ఉదయం 11.34 గంటలకు నింగిలోకి బయల్దేరనుంది. చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ఉద్దేశించిన ఈ మిషన్‌.. ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఆర్టెమిస్‌-1 మూన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి.. అమెరికాకు చెందిన నాసా (National Aeronautics and Space Administration) కౌంట్ డౌన్ ను ప్రారంభించింది.

ప్రస్తుతం ఆర్టెమిస్‌-1 మిషన్‌లోని ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవ రహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిరానుంది. ఆర్టెమిస్‌-1 స్పేస్‌ క్యాప్సూల్‌లో మనుషులను నాసా పంపడం లేదు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే.. 2024 లో ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి తీసుకెళ్లాలని నాసా భావిస్తోంది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఆర్టెమిస్‌-3 ని 2025 ప్రయోగించేందుకు నాసా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది.

అపోలో ప్రాజెక్టు అనంతరం 50 ఏండ్ల తర్వాత మరోసారి మనుషుల్ని చంద్రుడిపైకి పంపేందుకు ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 1972 లో ప్రాజెక్ట్‌ అపోలో ముగిసిన తర్వాత మళ్లీ వ్యోమగాములను పంపే ప్రయత్నం జరుగలేదు. మళ్లీ ఇప్పుడే.. ఆర్టిమిస్‌తో చంద్రుడిపై ప్రయోగాలు మొదలు పెట్టింది నాసా..

ఇవి కూడా చదవండి

భూమి మీద వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఇక్కడి వనరులు అడుగంటిపోతున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో మనిషికి మరో సేఫ్‌ జోన్‌ అవసరం అన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఆ కొత్త బంగారు లోకం కోసం.. మన శాస్త్రవేత్తలు అన్వేషణ కూడా మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే.. చంద్రుడు, మార్స్‌పై సైంటిస్ట్‌ల దృష్టి పడింది. ఇప్పటికే చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు తేలడంతో.. జాబిల్లి మీద ఇల్లు కట్టాలనుకుంటున్న మానవుడి కల సాకారం కావటానికి ఇక ఎంతో దూరంలేదనిపిస్తోంది.

కాగా, నాసాకు చెందిన ఆర్టెమిస్‌-1 మూన్ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు. నాసాకు చెందిన ప్లాట్ ఫామ్స్ తోపాటు.. పలు టీవీ ఛానెళ్లలోనూ వీక్షించవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..