దూసుకొస్తోన్న గ్రహశకలం.. భూమిని ఢీ కొడుతుందా.. ఆకాశంలో ఏం జరగనుంది..?

అంతరిక్షం అనేది అంతులేనిది. అందులో నిత్యం ఏదో ఒక ప్రమాదమో, అద్భుతమో జరుగుతూనే ఉంటుంది. గ్రహశకలాలు (Asteroid) , ఉల్కలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు, వ్యర్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వంలో...

దూసుకొస్తోన్న గ్రహశకలం.. భూమిని ఢీ కొడుతుందా..  ఆకాశంలో ఏం జరగనుంది..?
Asteroid
Follow us

|

Updated on: Mar 24, 2022 | 10:07 AM

అంతరిక్షం అనేది అంతులేనిది. అందులో నిత్యం ఏదో ఒక ప్రమాదమో, అద్భుతమో జరుగుతూనే ఉంటుంది. గ్రహశకలాలు (Asteroid) , ఉల్కలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు, వ్యర్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వంలో ప్రతీది కొత్తదే. అయితే అంతరిక్షంలో ఏర్పడే కొన్ని చర్యల వల్ల కొన్ని సార్లు భూమికి ముప్పు ఏర్పడుతుంది. అలాంటి ముప్పే ఇవాళ ఏర్పడే అవకాశం ఉంది నాసా (NASA) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓ గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తుందని గుర్తించారు. ఇది భూమిపై పడితే చాలా ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు(scientists) అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం ఈ రోజే భూమిని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా గ్రహశకలాలు ఇప్పుడు భూమి వైపు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలూ జరిగాయి. కొన్ని ప్రమాదం కలిగిస్తే మరికొన్నింటి ద్వారా ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. అంతరిక్షం నుంచి భూమికి మరో ప్రమాదం రాబోతోంది. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా వెల్లడించింది. ఈ శకలం గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు పయనిస్తున్నట్లు పేర్కొంది.

450 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ గ్రహ శకలం మిగతా వాటితో పోలిస్తే చిన్నదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఇది భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది ఈసారి భూమికి 51,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం ఈ రోజే భూమిని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. 2033 జులై 14న మరోసారి ఇది భూమి దగ్గరకు వస్తుందనే అంచనాలున్నాయి.

Also Read

Andhra Pradesh: మీరు తినే మాంసం వెనుక భారీ మోసం.. ఈ విషయం తెలుసుకోకపోతే మీరు అయిపోయినట్లే

Viral Video: టూరిస్టులపై విరుచుకుపడ్డ భారీ తిమింగలం.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో..!

Pooja Hegde: అప్పుడే ఆ విషయం అర్థమైంది.. వేదాంతం వల్లించిన బుట్ట బొమ్మ..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో