Vizag: ఉక్రెయిన్ నుంచి ఆకలితో కూతురు..ఎయిర్‌పోర్టులోనే బిర్యానీ పెట్టిన తల్లి!
ఉక్రెయిన్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విద్యార్థినికి..ఓ తల్లి అందించిన ప్రేమ అందరికీ ఆకట్టుకుంది. ఆకలితో తన బిడ్డ ఎంత అల్లాడిపోతుందోనని ఇంటి దగ్గరి నుంచే బిర్యానీ తీసుకువచ్చింది ఆ అమ్మ.

Russia-Ukraine War: ఉక్రెయిన్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విద్యార్థినికి..ఓ తల్లి అందించిన ప్రేమ అందరికీ ఆకట్టుకుంది. ఆకలితో తన బిడ్డ ఎంత అల్లాడిపోతుందోనని ఇంటి దగ్గరి నుంచే బిర్యానీ తీసుకువచ్చింది ఆ అమ్మ. తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)కు చెందిన రామలక్ష్మి… తన కూతురు తేజస్విని విశాఖకు రాగానే అక్కడే తన చేత్తో బిర్యానీ తినిపించి..కన్న ప్రేమను చాటింది. ఈ ఘటన స్థానికులందరినీ కన్నీరు పెట్టించింది. యుద్ధభూమి ఉక్రెయిన్ నుంచి కొందరు విద్యార్ధులు క్షేమంగా బయటపడ్డప్పటికీ.. ఇంకా చాలా మంది అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన తెలుగు విద్యార్ధులు మరికొందరు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. తమను భారత్(india)కు పంపించాలటూ ఎంబసీ అధికారులను వేడుకుంటున్నారు విద్యార్ధులు. బాంబు దాడులు, సైరన్‌ల మోతతో ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు బిక్కుబిక్కుమంటున్నారు. నాలుగు రోజులుగా బంకర్లలోనే విద్యార్ధులు తలదాచుకుంటున్నారు. దీంతో తిండిలేక అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు విద్యార్థులు అక్కడి తమ పరిస్ధితిని తెలియజేస్తూ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ.. సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారనీ… ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాల అధినేతలతో మాట్లాడి.. భారతీయులను వారి బార్డర్‌లోకి అనుమతించేలా ఒప్పించారని చెప్పారు. దీనిపై కేంద్రంలోని కీలక శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయనీ.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు కిషన్‌రెడ్డి.
Also Read: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్