Africa Parliament: పార్లమెంట్లలో భారీ అగ్ని ప్రమాదం.. కీలక డాక్యూమెంట్లు దగ్ధం.. అసలేం జరుగుతోంది..!

Africa Parliament: మొన్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మంటలను మరువక ముందే, తాజాగా మరో పార్లమెంట్‌ మంటల్లో చిక్కుకుంది. తాజాగా దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో..

Africa Parliament: పార్లమెంట్లలో భారీ అగ్ని ప్రమాదం.. కీలక డాక్యూమెంట్లు దగ్ధం.. అసలేం జరుగుతోంది..!
Follow us

|

Updated on: Jan 03, 2022 | 8:16 AM

Africa Parliament: మొన్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మంటలను మరువక ముందే, తాజాగా మరో పార్లమెంట్‌ మంటల్లో చిక్కుకుంది. తాజాగా దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి పార్లమెంట్ భవనంలోని మూడో అంతస్తు సహా, నేషనల్ అసెంబ్లీ ఛాంబర్​లకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలు ఆర్పారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు అక్కడి అధికారులు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అధికారులు. అటు మొన్న ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు నిరసనకారులు. క్యాన్బెరాలో ఉన్న పాత పార్లమెంట్ భవన తలుపులు ఆ మంటల్లో దగ్ధం అయ్యాయి. ఓ నిరసన ప్రదర్శనలో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఘటనలో కూడా ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనను ఖండించారు ప్రధాని స్కాట్ మారిసన్. ఆస్ట్రేలియన్లు ఇలా ప్రవర్తిస్తారని అనుకోవడం లేదని, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ కు నిప్పు పెడుతారా అని ప్రశ్నించారు. అయితే, ఈ రెండు ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగితే పరిస్థితులు ఇలా ఉండవని అంటున్నారు అక్కడి అధికారులు. అటు సౌతాఫ్రికా పార్లమెంట్ భవనంలో పలు కీలక డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ఇష్యూపై దర్యాప్తు చేస్తున్నారు అక్కడి అధికారులు. దర్యాప్తు తర్వాత ఈ అగ్నిప్రమాదం, దానికి కారణాలపై ఫుల్‌ క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ ప్రమాదాలపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు.

Also read:

Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!

Assembly Elections: ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ఈసీకి విజ్ఞప్తి.. కారణం ఏంటంటే..

Vaccination:15 నుంచి 18 ఏళ్లలోపు వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 4.5 లక్షల మంది..

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా