ఇండోనేషియాలో భారీ భూకంపం
పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. ఇండోనేషియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. టెర్నాటే నగరం సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. టెర్నాటే నగరానికి ఆగ్నేయదిశగా 10 కిలోమీటర్లు లోతున భూకంపం ఏర్పడినట్టు నిపుణులు పేర్కొన్నారు. ఒక్కసారిగా భూమి కుదుపుకు లోనవటంతో స్థానికుంలందరూ భయాందోళనలకు లోనై రోడ్ల మీదకు పరిగెత్తుకొచ్చారు. కాగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ప్రజలు […]
పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. ఇండోనేషియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. టెర్నాటే నగరం సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. టెర్నాటే నగరానికి ఆగ్నేయదిశగా 10 కిలోమీటర్లు లోతున భూకంపం ఏర్పడినట్టు నిపుణులు పేర్కొన్నారు. ఒక్కసారిగా భూమి కుదుపుకు లోనవటంతో స్థానికుంలందరూ భయాందోళనలకు లోనై రోడ్ల మీదకు పరిగెత్తుకొచ్చారు. కాగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ప్రజలు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం సముద్రానికి దూరంగా ఉండటంతో..సునామీ భయమేమీ లేనట్టు తెలుస్తోంది. తక్షణం రంగంలోకి దిగిన అధికారులు..సహాయక చర్యలు చేపట్టారు.
రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే ప్రమాదకర జోన్ లో ఇండోనేషియా దీవులు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచుగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు తమ ప్రభావం చూపిస్తుంటాయి. కాగా, తాజా భూకంపం నేపథ్యంలో నష్టం తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలపైనా స్పష్టత రాలేదు.