మూన్.. ఎ డిస్కవరీ.. ‘ మజిలీలు ‘ ఎన్నో !
చంద్రునిపై మహా యానం.. ఇండియా తలపెట్టిన ‘ మహా యజ్ఞం ‘.. ఇప్పటివరకూ ఏ దేశ ఉపగ్రహమూ చంద్రునిపైని సౌత్ పోలార్ సమీపం వరకు వెళ్లక పోవడంతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ‘ ఇస్రో ‘ చేబట్టిన అద్భుత అంతరిక్ష ప్రయత్నం. ఇదే చంద్రయాన్-2 మిషన్ ధ్యేయం. చంద్రునికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకోవడం, పూర్తి వివరాలను ఔపోసన పట్టడం అన్నవి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ డిస్కవరీ ఇండియాకే కాక.. మొత్తం మానవాళికే […]
చంద్రునిపై మహా యానం.. ఇండియా తలపెట్టిన ‘ మహా యజ్ఞం ‘.. ఇప్పటివరకూ ఏ దేశ ఉపగ్రహమూ చంద్రునిపైని సౌత్ పోలార్ సమీపం వరకు వెళ్లక పోవడంతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ‘ ఇస్రో ‘ చేబట్టిన అద్భుత అంతరిక్ష ప్రయత్నం. ఇదే చంద్రయాన్-2 మిషన్ ధ్యేయం. చంద్రునికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకోవడం, పూర్తి వివరాలను ఔపోసన పట్టడం అన్నవి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ డిస్కవరీ ఇండియాకే కాక.. మొత్తం మానవాళికే ప్రయోజనకరమన్నది ఇస్రో శాస్త్రవేత్తల భావన. ఈ మిషన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రోదసిలో మరిన్ని ‘ సాహస యాత్రలకు ‘ శ్రీకారం చుట్టాలని రీసెర్చర్లు భావిస్తున్నారు.
అసలు చంద్రునిపైకే ఎందుకు వెళ్తున్నాం ? అని ప్రశ్నించుకుంటే డీప్ స్పేస్ మిషన్లకు అవసరమైన టెక్నాలజీలను డెమాన్ స్ట్రేట్ చేయడానికని వీరు చెబుతున్నారు. అలాగే అంతరిక్షంపై అవగాహన ఇంకా పెంచుకోవడానికి, గ్లోబల్ అలయెన్స్ కు, భవిష్యత్ తరాల పరిశోధనలకే కాకుండా శాస్త్రజ్ఞులకు అవసరమైన సరికొత్త విషయాలను ప్రపంచానికి అందించడం అన్న లక్ష్యాల సాధనకేనని అంటున్నారు. శాస్త్రీయపరమైన ఆబ్జెక్టివ్ ల విషయానికి వస్తే.. ఈ భూతలంపైని తొలి చరిత్రకు, చంద్రునికి లింక్ ఉంది. సౌర వ్యవస్థకు సంబంధించి రికార్డులు చెక్కు చెదరకుండా ఉండగా.. చంద్రుని పుట్టుక, పరిణామ క్రమం ఇంకా మిస్టరీగానే ఉంది. చంద్ర గ్రహంపైని సౌత్ పోల్ చాలా ముఖ్యమైనది. నార్త్ పోల్ కన్నా దీని ఉపరితలంపైనే నీటి జాడలున్నట్టు అంచనా వేస్తున్నారు. పైగా ఈ ఉపరితలం పైని క్రేటర్స్ (లోతైన గుంతలు)ల్లో ప్రాచీన సోలార్ సిస్టం లోని శిలాజాలతో కూడిన అనేక ‘ వ్యవస్థ ‘ లున్నాయని భావిస్తున్నారు.
‘ మంజినస్-సి ‘ , ‘ సీంపెలియన్-ఎన్ ‘ అని వ్యవహరిస్తున్న రెండు క్రేటర్స్ మధ్య విక్రమ్ లాండర్, ప్రగ్యాన్ రోవర్లు సాఫ్ట్ ల్యాండింగ్ కు అనువుగా ఈ మిషన్ ని నిర్దేశించారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడుగా భావిస్తున్న డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరునే ఆయన గౌరవ ప్రదంగా … ఈ మిషన్ లో ఈ లాండర్ కు ఆ పేరు పెట్టినట్టు తెలుస్తోంది.వన్ ల్యూనార్ డే అంటే.. సుమారు 14 భూతల (ఎర్త్) రోజులకు సమానంగా పని చేయడానికి అనువైన రీతిలో దీన్ని రూపొందించారు. ఇది తన రోవర్ కే కాకుండా బెంగుళూరు సమీపంలోని బైలాలు ప్రాంతంలో గల స్పేస్ సెంటర్ కు కూడా కమ్యూనికేషన్ చేయగలదు. అలాగే ఆర్బిటర్ ప్రగ్యాన్ రోవర్ తో బాటు సెకండుకు 2 మీటర్ల టచింగ్ వెలాసిటీతో లూనార్ సార్ ఫేస్ పై ఆడుగుపెట్టగలదు. 27 కేజీల బరువున్న ఈ రోవర్ లో రెండు పే లోడ్లు ఉంటాయి. వీటిలో రెండు పెద్ద ఏరియా సాఫ్ట్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్లు, ఐ ఆర్ స్పెక్ట్రోమీటర్, సింథటిక్ అపెర్చర్ రాడార్, ఆర్బిటర్ హై రిసోల్యుషన్ కెమెరా వంటి అధునాతన వ్యవస్థలుంటాయి. ఆరు చక్రాలున్న ఈ పదాన్ని సంస్కృతంలో అనువదిస్తే.. ‘ విస్ డమ్ ‘ (గొప్పదనం) అన్న అర్థమట. ఈ రోవర్ సెకండుకు ఒక సెంటీమీటర్ వేగంతో 500 మైళ్ళ వరకు ప్రయాణించగలదు. సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని పని చేయగలదు.
ఇక జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ ని భవిష్యత్తులో భారత మానవ సహిత మిషన్లకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ‘ బాహుబలి ‘గా అభివర్ణిస్తున్న ఈ వెహికల్ లో మూడు దశల రాకెట్లు ఉంటాయి. తొలిదశ రాకెట్లో సాలిడ్ ఫ్యూయెల్ తో కూడిన టాంకులు, రెండో దశలో లిఫ్ట్ ఆఫ్ట్ అయ్యాక.. 14 సెకండ్ల పాటు మండే కోర్ బూస్టర్ ఉంటుంది. ఇది లిక్విడ్ ఫ్యూయల్ ని మండిస్తుంది. ఫైనల్ దశలో క్రయోజనిక్ ఇంజన్ ఉంటుంది. రాకెట్ నుంచి ఇది బూస్టర్ ని విడిపోయేలా చేస్తుంది. ఇన్ని సాంకేతిక విశిష్టతలున్న ఈ చంద్రయాన్-2 మిషన్ సక్సెస్ కావాలని ఇస్రోతో బాటు భారతీయులంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.