గోవా బీజేపీకి షాక్.. ప్రభుత్వం నుంచి జీఎఫ్‌పీ క్విట్
గోవా బీజేపీ ప్రభుత్వానికి జీఎఫ్‌పీ ఝలక్ ఇచ్చింది. మంత్రి పదవుల నుంచి తమను తప్పించి పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటుకల్పించడంతో.. గోవా ఫార్వార్డ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేశాయ్ మీడియాకు వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని గవర్నర్ మృధులా సిన్హాకు లేఖ […]
గోవా బీజేపీ ప్రభుత్వానికి జీఎఫ్‌పీ ఝలక్ ఇచ్చింది. మంత్రి పదవుల నుంచి తమను తప్పించి పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటుకల్పించడంతో.. గోవా ఫార్వార్డ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేశాయ్ మీడియాకు వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని గవర్నర్ మృధులా సిన్హాకు లేఖ ద్వారా తెలియజేసినట్టు చెప్పారు.