బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్
బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ నియమితులయ్యారు. పార్టీ, ఆర్‌ఎస్ఎస్ వారధిగా ఉండే ఈ కీలకమైన పదవిలో గత 13 ఏళ్లుగా సేవలందించిన రాంలాల్ స్థానంలో ఆయనను నియమిస్తున్నట్టు బీజేపీ వెల్లడించింది. ఇప్పటివరకు పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా సంతోష్ సేవలందించారు. అంతేకాదు కర్ణాటక ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, రాంలాల్‌ను సహా సంపర్క ప్రముఖ్‌గా నియమిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ పేర్కొంది.