AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రయాన్-2…. 20 గంటల కౌంట్ డౌన్ షురూ !

చంద్రయాన్-2 మిషన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రారంభం గల ఈ మిషన్ కి సంబంధించి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై రోబోటిక్ రోవర్ ని అడుగు పెట్టించాలన్నది మన ధ్యేయం. ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ ‘ జీ ఎస్ ఎల్వీ ..ఎంకే.-3 ‘ ని చంద్రునిపైకి […]

చంద్రయాన్-2.... 20 గంటల కౌంట్ డౌన్ షురూ !
Anil kumar poka
| Edited By: |

Updated on: Jul 14, 2019 | 1:16 PM

Share

చంద్రయాన్-2 మిషన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రారంభం గల ఈ మిషన్ కి సంబంధించి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై రోబోటిక్ రోవర్ ని అడుగు పెట్టించాలన్నది మన ధ్యేయం. ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ ‘ జీ ఎస్ ఎల్వీ ..ఎంకే.-3 ‘ ని చంద్రునిపైకి ప్రయోగిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని మొత్తం కాల వ్యవధి ఏడాదిపాటని వారు పేర్కొన్నారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి దాదాపు రెండు నెలల అనంతరం ఈ రాకెట్ లాంచర్ చంద్రుని సౌత్ పోల్ సమీపంలో దిగుతుందని వారు వివరించారు. 640 టన్నుల రాకెట్ లాంచర్ అయిన దీన్ని ‘ బాహుబలి ‘గా అభివర్ణిస్తున్నారు. 15 అంతస్థుల బిల్డింగ్ అంతటి పొడవైన ఈ లాంచర్.. 3.8 టన్నుల బరువైన ఉపగ్రహాన్ని చంద్రునిపైకి మోసుకుపోతుంది. భారత దేశం ప్రయోగిస్తున్న అతి బరువైన లాంచర్లలో ఇది మూడవది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిలకించనున్నారు. స్పేస్ పోర్ట్ నుంచి లైవ్ లాంచ్ ని చూసే మూడవ రాష్ట్రపతి కానున్నారు ఆయన.. దాదాపు రూ. 1,000 కోట్లతో చేపడుతున్న చంద్రయాన్-2 మిషన్ లో 1.4 టన్నుల విక్రమ్ లాండర్ కూడా ఓ భాగం. ఇది 27 కిలోల బరువైన ‘ ప్రగ్యాన్ ‘ రోవర్ ని మోసుకుపోతుంది. చంద్రుని సౌత్ పోల్ పై రెండు లోతైన ప్రదేశాల మధ్య ఈ రోవర్ దిగనుంది. ఈ రోవర్ చేసే 15 నిముషాల పని ‘ టెరిఫయింగ్ మూమెంట్స్ ‘ అని ఇస్రో చీఫ్ కె. శివన్ అభివర్ణించారు.ఇలాంటి క్లిష్టమైన పనిని తాము ఇదివరకెన్నడూ చేపట్టలేదన్నారు. ఈ ప్రయోగంలో ఇండియా సక్సెస్ అయితే.. ల్యూనార్ సర్ ఫేస్ పై తమ ఉపగ్రహాలను అడుగుపెట్టించడంలో విజయం సాధించిన నాలుగో దేశంగా అవతరిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇజ్రాయెల్ ఇలాంటి ప్రయోగం చేసి విఫలమైంది.

Follow Us
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
విరోష్ లను కలిపిన 'గీతగోవిందం'ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
విరోష్ లను కలిపిన 'గీతగోవిందం'ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
ఆ కళ్లజోళ్లు వాడుతున్నారా..? అయితే మీ ప్రతి మూమెంట్ ..!
ఆ కళ్లజోళ్లు వాడుతున్నారా..? అయితే మీ ప్రతి మూమెంట్ ..!
మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?
మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?
అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్..
అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్..