Mahatma Gandhi: మహాత్మాగాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష.. మోసం కేసులో డర్బన్ కోర్టు తీర్పు..

|

Jun 08, 2021 | 11:06 AM

Ashish Lata Ramgobin: మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్‌కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మోసం, ఫోర్జరీ కేసులో

Mahatma Gandhi: మహాత్మాగాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష.. మోసం కేసులో డర్బన్ కోర్టు తీర్పు..
Ashish Lata Ramgobin
Follow us on

Ashish Lata Ramgobin: మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్‌కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మోసం, ఫోర్జరీ కేసులో కోర్డు ఆమెను దోషిగా తేల్చింది. వ్యాపారవేత్తను మోసం చేసి రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను దోషిగా తేల్చుతూ డర్బన్ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. 56 ఏళ్ల ఆశిష్ లతా రామ్‌గోబిన్ వ్యాపారవేత్త మహరాజ్‌ను మోసం చేసినట్లు నిరుపితమైందని కోర్టు పేర్కొంది. ఆమెకు ఇండియా నుంచి వచ్చే ఓ కంటైన్‌మెంట్ కోసం ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్.. ఆమెకు అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చారు. అనంతరం దాని ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుంది. అయితే.. అలాంటి కన్‌సైన్‌మెంటే లేదని.. నకిలీ బిల్లులు సృష్టించి… ఆమె ఆయన్ను మోసం చేసినట్లు వెల్లడికావడంతో డర్బన్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే.. ఈ కేసు విచారణ 2015 నుంచి కొనసాగుతోంది. ఆశిప్ లతా ఈ కేసులో అరెస్ట్ అయ్యాక దక్షిణాఫ్రికా కరెన్సీ 50,000 ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి బెయిల్‌పై విడుదల అయ్యారు.

ఆశిష్ లతా.. న్యూ ఆఫ్రికా ఎలియాన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు డైరెక్టర్ ఎస్ ఆర్ మహరాజ్‌ ను కలిసిన అనంతరం అప్పు తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం లైనెన్ క్లాత్ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆశిష్ మహరాజ్‌కు తెలియజేశారు. ఇలా నగదు ఇచ్చినందుకు లాభాల్లో కొంతమొత్తాన్ని ఇస్తామని పేర్కొన్నారు. అయితే ఆమె నకిలీ ఇన్వాయిస్ ఆధారంగా డబ్బు తీసుకున్నట్లు నిరుపితమైంది.

గాంధీజీ మనవరాలు, మానవ హక్కుల కార్యకర్త ఎలా గాంధీ కుమార్తె ఆశిష్ లతా రామ్‌గోబిన్‌.. ఎలా గాంధీ తన సేవలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా ఇండియా, దక్షిణాఫ్రికాల నుంచి పలు సత్కారాలు, పురస్కారాలు సైతం గడించారు. అయితే.. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ తన పదవీకాలంలో స్థాపించిన ఫీనిక్స్ సెటిల్ మెంట్ ను పునరుద్ధరించడంలో ఎలా గాంధీ, మేవా రామ్‌గోవింద్ కీలక పాత్ర పోషించారు.

Also Read:

Ganga River: గంగా నదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం.. యూపీ, బీహార్‌లో పరిశోధనలు..

Woman Get Wallet: ఊహించని ట్విస్ట్.. 46 సంవత్సరాల క్రితం పొగొట్టుకున్న పర్స్ ఇప్పుడు దొరికింది.. అందులోని ఉన్నవి చూసి..