Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ చికెన్ పీస్ ఏకంగా రూ. 73 లక్షలకు అమ్ముడైంది. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

నాన్-వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలు లొట్టలు వేసుకుని తింటారు. అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ వంటకాలు ఏదైనా కూడా హాట్ కేకుల్లా...

Viral News: ఈ చికెన్ పీస్ ఏకంగా రూ. 73 లక్షలకు అమ్ముడైంది. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
Chicken
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2021 | 9:46 AM

నాన్-వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలు లొట్టలు వేసుకుని తింటారు. అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ వంటకాలు ఏదైనా కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. ఇదిలా ఉంటే చికెన్‌తో తయారు చేసిన ఏ ప్రత్యేకమైన వంటకం అయినా రూ. 10 వేలు మించి ఉండదు. కానీ ఇక్కడ ఓ చికెన్ పీస్ ఏకంగా రూ. 73 లక్షలకు అమ్ముడైంది. ఏంటి.! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమండీ..

ఫాస్ట్ ఫుడ్ ఔత్సాహికులకు మెక్‌‌డొనాల్డ్ చికెన్ నగ్గెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీటిని తెగ ఇష్టపడతారు. ఈ నగ్గెట్స్ వీడియో గేమ్‌లోని ఓ పాత్ర ఆకారంలో తయారు చేస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఆన్‌లైన్ గేమ్ ‘అమాంగ్ అస్’ అనే వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ ఆకారంలో తయారు చేసిన మెక్‌డొనాల్డ్స్ చికెన్ నగ్గెట్ ఒకటి $ 99,997కు అమ్ముడైంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 73 లక్షలు.

ఈ చికెన్ నగ్గెట్‌ను eBayలో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ పెట్టగానే జనాలు ఎగబడ్డారు. ‘అమాంగ్ అస్’ వీడియో గేమ్‌ను ఇష్టపడేవారు.. ఆ చికెన్ నగ్గెట్‌ను సొంతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇక ఆ చికెన్ ముక్కను ఉటాకు చెందిన పోలిజ్నా అనే వ్యక్తి రూ. 73 లక్షలకు కొనుగోలు చేశాడు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

Chicken Nugget