France: ఫ్రాన్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాల ఆసక్తి.. ఆ చట్టాల వల్లే ఇన్వెస్ట్ మెంట్లు..
France: యూరప్‌లోని 44 దేశాలలో EY నిర్వహించిన ఒక సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో కరోనా సృష్టించిన విలయంతో ఖండం అంతటా విదేశీ పెట్టుబడులు 13 శాతం తగ్గాయి.
France: యూరప్‌లోని 44 దేశాలలో EY నిర్వహించిన ఒక సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో కరోనా సృష్టించిన విలయంతో ఖండం అంతటా విదేశీ పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు తిరిగి కోలుకుంటున్నాయి. విదేశీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దీర్ఘకాలిక గమ్యస్థానంగా యూరప్ తన హోదాను నిలుపుకుంటుందని వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయని సర్వే హైలైట్ చేస్తోంది. ఉదాహరణకు.. ఫ్రాన్స్ 2021లో ప్రకటించిన విదేశీ ప్రాజెక్టుల్లో 24 శాతం పెరుగుదలను చూసింది.
భారత్ లోని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మాట్లాడుతూ.. కార్మిక చట్టాల్లో బలమైన సంస్కరణలు, కార్పొరేట్ పన్నుల తగ్గింపు, ఐరోపాలో విదేశీ పెట్టుబడులకు ఫ్రాన్స్ ప్రథమ గమ్యస్థానంగా నిలిచేందుకు సహాయపడిందని అన్నారు. యూరప్ లో విదేశీ పెట్టుబడులకు వరుసగా మూడో సంవత్సరం కూడా ఫ్రాన్స్ మొదటి స్థానాన్ని కొనసాగించింది. గత ఐదేళ్లలో దేశంలో చేపట్టిన సంస్కరణలకు ఇది స్పష్టమైన గుర్తింపని ఆయన అన్నారు. కార్మిక చట్టాల బలమైన సంస్కరణ, కార్పొరేట్ పన్నులను తగ్గింపు, మూలధన లాభాలపై ఫ్లాట్ టాక్స్ వంటివి మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు. భారత్- ఫ్రాన్స్ మధ్య సహకారానికి అణుశక్తి గొప్ప రంగమని ఆయన అన్నారు.
దశాబ్దాలుగా ఫ్రాన్స్ అణుశక్తిపై పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం విద్యుత్తులో 80-85 శాతం అణుశక్తి ద్వారా అందించబడుతుంది. ఫలితంగా ఫ్రాన్స్ ఐరోపాలో అతి తక్కువ విద్యుత్ ధరను కలిగి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ యూరోపియన్ యూనియన్ ఇప్పటికీ ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతోందని భారత్ లోని EU రాయబారి ఉగో అస్టుటో అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్యంలో పూర్తిగా విలీనం చేయబడిన అధునాతన ఆర్థిక వ్యవస్థగా ఈయూ కొనసాగుతోంది. EU రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవటంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు వెళ్లాలని కోరుకుంటున్నట్లు అస్టుటో చెప్పారు. గ్యాస్ విషయంలో ఇతర సరఫరా మార్గాలను అన్వేషించే పనిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాము పునరుత్పాదక, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులను వేగవంతం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.