AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

James Marape: రూల్స్ బ్రేక్ చేసి మరీ మోడీకి పాదాభివందనం.. పాపువా న్యూ గినియా ప్రధాని కథేంటో మీకు తెలుసా..?

పాపువా న్యూ గినియా దేశం చేరుకున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే మోదీకి ఘన స్వాగతం పలికారు. ఏకంగా మోదీకి పాదాభివందనం చేశారు. ఆ దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించాయి.

James Marape: రూల్స్ బ్రేక్ చేసి మరీ మోడీకి పాదాభివందనం.. పాపువా న్యూ గినియా ప్రధాని కథేంటో మీకు తెలుసా..?
James Marape touches PM Modi's feet
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2023 | 1:50 PM

Share

పాపువా న్యూ గినియా దేశం చేరుకున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే మోదీకి ఘన స్వాగతం పలికారు. ఏకంగా మోదీకి పాదాభివందనం చేశారు. ఆ దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించాయి. వాస్తవానికి సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది, కానీ ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఈ దేశం తన సంప్రదాయానికి బ్రేక్ వేసింది. అంతే కాకుండా మోదీకి ఏకంగా ఆ దేశ ప్రధాని పాదాభివందనం చేయడం విశేషం.

ఈ సంఘటనతో ఇంతకీ ఈ జేమ్స్‌ మరాపే ఎవరు ఆయన హిస్టరీ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. విమానం దిగి వస్తున్న ప్రధాని మోదీకి ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రధాని మోదీ.. జేమ్స్‌ను పైకి లేపి భుజం తట్టి ఆలింగనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పంగుపాటి రాజకీయ పార్టీకి చెందిన 52 ఏళ్ల జేమ్స్ మరాపే 2019 నుండి పపువా న్యూగినియాకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆ దేశానికి ఆయన 8వ ప్రధాని. జేమ్స్ మరాపే 1993లో యూనివర్శిటీ ఆఫ్ పాపువా న్యూ గినియా నుంచి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ పట్టభద్రుడయ్యారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆనర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. గత ప్రభుత్వాలలో అనేక కీలక క్యాబినెట్ పదవులను నిర్వహించారు.

2019 లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పంగు పాటిలో చేరారు జేమ్స్‌ మరాపే. 2020లో అవిశ్వాస తీర్మానం ద్వారా అతని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విఫల ప్రయత్నం జరిగినా తన చాకచక్యంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడో హైలేవల్‌ మీటింగ్‌కు జేమ్స్ మరాపేతో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..