కిమ్‌కి అప్పుడే ఆ భయం పోయిందా..? గురువు అంత్యక్రియల్లో అతన్ని చూసి నెటిజన్లు షాక్‌! ఎలా ఉన్నాడంటే…

కిమ్‌కి అప్పుడే ఆ భయం పోయిందా..? గురువు అంత్యక్రియల్లో అతన్ని చూసి నెటిజన్లు షాక్‌! ఎలా ఉన్నాడంటే...
Kim

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్‌కు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే గురువు. అనారోగ్య కారణాల‌తో ఆయ‌న మృతి చెందారు. దీంతో ఆయ‌న‌

Jyothi Gadda

|

May 24, 2022 | 10:02 PM

ఉత్తర కొరియాలో కరోనా లక్షణాలతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. కానీ దేశాధినేత కిమ్‌కు ఇవేమీ పట్టలేదు. ముఖానికి కనీసం మాస్క్‌ కూడా లేకుండా ఓ సైనిక జనరల్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉత్తర కొరియాకు చెందిన పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హయోన్‌ చాల్‌ హెయ్‌ .. శరీర అవయవాలు పనిచేయక మృతి చెందారు. ఆయన కిమ్‌కు అత్యంత నమ్మకస్తుడు. అంత్యక్రియల్లో పాల్గొన్న కిమ్‌ .. హయోన్‌ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికను స్వయంగా మోశారు. ఈ సమయంలో మిగిలిన అధికారులు మాస్కులు ధరించినా.. కిమ్‌ మాత్రం మాస్క్‌ లేకుండానే అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

Kim1

Kim1

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్‌కు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే గురువు. అనారోగ్య కారణాల‌తో ఆయ‌న మృతి చెందారు. దీంతో ఆయ‌న‌ అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న కిమ్ నివాళులు అర్పించారు. ఇటీవ‌ల మాస్కు ధ‌రించి క‌న‌ప‌డిన కిమ్‌.. గురువు అంత్య‌క్రియ‌ల్లో మాత్రం మాస్కు లేకుండానే పాల్గొన్నారు. ఇత‌రులు అంద‌రూ మాస్కులు ధరించి ఇందులో పాల్గొన్నారు. గురువు శవపేటికను ఆయన కూడా మోశారు. కాగా, కిమ్ జాంగ్‌-2 మ‌ర‌ణం అనంత‌రం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే కీలక పాత్ర పోషించారు. అందుకే గురువుపై కిమ్ అంతగా భ‌క్తిని చాటుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu