Kamala Harris: కమలా హారిస్‌పై నాన్‌లోకల్‌ ముద్ర.. దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

కమలా హారిస్ పై ట్రంప్ మద్దతుదారులే కాదు.. డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కొన్నేళ్ళ కిందటి దాకా ఆమె నల్లజాతీయురాలని తనకు తెలియదని.. ఇప్పుడు ఆమె తాను నల్లజాతీయురాలినని చెప్పుకుంటున్నారని.. ‘‘ఆమె భారతీయురాలా, నల్లజాతీయురాలా? నాకు తెలియదు’ అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారాయి..

Kamala Harris: కమలా హారిస్‌పై నాన్‌లోకల్‌ ముద్ర.. దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
Kamala Harris - Donald Trump
Follow us

|

Updated on: Sep 03, 2024 | 8:07 PM

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది.. నవంబర్ నెలలో యునైటెడ్ స్టేట్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ నుంచి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తలపడుతున్నారు. అనారోగ్య కారణాలతో ప్రస్తుత ప్రెసిడెంట్‌ బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల బరినుంచి వైదొలిగి.. కమలా హారిస్‌ పేరును నామినేట్‌ చేశారు. దీంతో భారత సంతతి మహిళా నాయకురాలు కమలా హారిస్‌ అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆనాటి నుంచి కమలా హారిస్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డెమొక్రాట్ల నుంచి ఆమెకు విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో కమలా హారిస్‌ పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది.. ఈ క్రమంలోనే.. డొనాల్డ్ ట్రంప్ కూడా తనపై దాడి నాటినుంచి దూకుడు పెంచారు.. ఈ సందర్భంగా జాతి, స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకురావడం సంచలనంగా మారింది.. వాస్తవానికి ప్రెసిడెంట్‌ రేసులోకి వచ్చాక.. కమలా హారిస్ టాక్ ఆఫ్‌ ది అమెరికన్ పాలిటిక్స్‌గా మారిపోయారు. అయితే ఆమెపై నాన్‌లోకల్‌ ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతుండటం సంచలనంగా మారింది. అమెరికా రాజ్యాంగంలోని చిన్న లూప్‌హోల్‌తో హరిస్‌ అభ్యర్థిత్వమే చెల్లదంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతుండటం.. అటు అగ్రరాజ్యంతో పాటు.. ఇటు భారత్ తోపాటు పలు దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.. కారణం ఏమిటంటే.. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ దూకుడు ప్రదర్శిస్తుండటం.. డెమొక్రాటిక్ అభ్యర్ధిగా కమలాను ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకూ ముందంజ వేసిన రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనకబడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమలాకే మొగ్గు ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలా ఎన్నికల వేడి పీక్స్‌కు చేసిన టైమ్‌లో.. కమలా హారిస్‌ నాన్‌ లోకల్‌ అనే వాదన తెరపైకి రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌.. యూఎస్‌ పౌరులకు జన్మించిన వారే అర్హులా..?

అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అర్హత లేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ వాదిస్తోంది. ఇలా.. నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌ను తెరపైకి తీసుకొచ్చింది నేషనల్ ఫెడరేషన్ (NFRA). అమెరికా రాజ్యంగం ప్రకారం అమెరికా గడ్డపై, అమెరికా సిటిజన్స్‌కే పుట్టిన వాళ్లే ప్రెసిడెంట్‌గా అర్హులు. ఇప్పుడు ఇదే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిన NFRA పలు కీలక విషయాలను ప్రస్తావిస్తోంది.. ఒక్క కమలా హారిసే కాదు, నిక్కీ హేలీ, రామస్వామి సహా పలువురు రాజకీయ నేతలు ఈ విషయాన్ని విస్మరించారని ఎన్ఎఫ్ఆర్ఏ వాదిస్తోంది. యూఎస్‌ పౌరులకు జన్మించిన వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించాలని చెబుతోంది. అయితే, అమెరికా రాజ్యాంగంలోని ఓ చిన్న లూప్‌హోల్‌తో హరిస్‌ అభ్యర్థిత్వంపై కుట్ర జరుగుతుందని డెమొక్రాటిక్ పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కావాలనే తప్పుడు వాదనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

1958లో కాలిఫోర్నియాకు వెళ్లిన కమలా హారిస్‌ తల్లి..

కమలా హారిస్‌ మూలాలు భారత్‌, జమైకాలోనూ ఉన్నాయి. కమలా హారిస్‌ తల్లి భారతీయురాలు.. తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్‌ 1958లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. 1963లో జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారిస్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుర్లు.. అయితే.. కమలా హారిస్‌ కాలిఫోర్నియాలో జన్మించారు. కమలా హారిస్‌ జన్మించే సమయానికి ఆమె తల్లిదండ్రులు యూఎస్‌ సిటిజన్స్‌ కాదు. ఇప్పుడు దీన్ని ట్రిగర్‌ చేసింది NFRA. అంతే కాదు 1857లో యూఎస్‌ సుప్రీం కోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ కమలా అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తోంది. అమెరికా పౌరులకు జన్మించిన వారే ప్రెసిడెంట్‌గా అర్హులని..1857లో డ్రేడ్ స్కాట్ కేసులో యూఎస్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించింది. కమలా హారిస్‌ను అనర్హులని తీర్మానం కూడా చేసింది. అయితే, ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను న్యాయ నిపుణులు కూడా సమర్థించడం లేదు. 1857లో సుప్రీం ఇచ్చిన తీర్పును హర్షించడం లేదు. అయితే ఎన్నికల్లో కమలా హరీస్‌ను ఎదుర్కోలేకే NFRA బలం లేని వాదనను తెరపైకి తీసుకొచ్చి వివాదం చేస్తోందని డెమెక్రాటిక్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. కమలా హారిస్‌ గెలుపు అవకాశాలు మెరుగుపడగానే కుట్ర జరుగుతుందని చెబుతున్నారు.

“అనేక రాష్ట్రాలు, అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ప్రాథమిక అధ్యక్ష అర్హతను విస్మరించాయి.. అభ్యర్థులు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, కమలా హారిస్‌లు పుట్టిన సమయంలో వారి తల్లిదండ్రులు అమెరికన్ పౌరులు కాదు” ప్రస్తుత డెమొక్రాటిక్ అభ్యర్థితో పాటు ఇద్దరు మాజీ రిపబ్లికన్ అభ్యర్థులను ఉదహరిస్తూ ఫెడరేషన్ సభ్యులు ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్..

డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కొందరు కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత లేదని తప్పుడు వాదనలు చేయడం.. వల్ల ఇది ఆమెకే కలిసివస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇది గతంలో ట్రంప్ మద్దతుదారులు చేసిన ‘యాంటీ ఒబామా’ ఉద్యమాన్ని ప్రతిధ్వనిస్తుంది.. అప్పుడు ఒబామాకు రాజకీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది.. ఇప్పుడు కమలా హారిస్ కు కూడా అలాంటి ఖ్యాతి తెచ్చిపెడుతుందని ఆమె మద్దతుదారులు విశ్వసిస్తున్నారు.

హారిస్.. అర్హురాలే..

US రాజ్యాంగం మొదటి సవరణ ప్రకారం.. “సహజంగా జన్మించిన పౌరుడు (నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌)” ప్రెసిడెంట్‌షిప్‌కు అర్హులే.. ఈ చట్టపరమైన వాదన ప్రకారం హారిస్ ను తప్పుపట్టే వాస్తవిక అవకాశాలే లేవు.. “ఈ రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో సహజంగా జన్మించిన పౌరుడు లేదా యునైటెడ్ స్టేట్స్ పౌరుడు తప్ప ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవికి అర్హులు కాదని అర్ధం.. ముప్పై-ఐదు సంవత్సరాలు నిండని, పద్నాలుగు సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్‌లో నివసించని ఏ వ్యక్తి కూడా అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హులు కాదని రాజ్యాంగం చెబుతోంది.. వాస్తవానికి తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వముందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది..

తీర్పు ఏమిటి?

డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ స్టాన్‌ఫర్‌ కేసు 1857 నాటిది… అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది. తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్‌ స్కాట్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ బానిస సుప్రీంకోర్టుకు వెళ్లాడు.. అందుకు కోర్టు నిరాకరించింది. పైగా ‘ఆఫ్రికన్‌ అమెరికన్లు దేశ పౌరులే కాదు. కనుక వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హతే లేదు’’అంటూ ధర్మాసనం పేర్కొంది. పైగా దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్‌కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది. దాంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ తీర్పును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. బానిసత్వాన్ని రద్దు చేయడమే గాక జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్లంతా దేశ పౌరులేనంటూ చట్టాన్ని చేశారు..

ఈ ప్రమాణాలను పరిశీలించినట్లయితే.. హారిస్ అన్ని విధాలుగా అర్హురాలే.. అయినప్పటికీ, ట్రంప్, అతని మద్దతుదారులు ఆమె గుర్తింపు గురించి ప్రశ్నించడం, ఆమె వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం తప్పిదమే అవుతుందని పేర్కొంటున్నారు రాజకీయ నిపుణులు..

గతంలో ట్రంప్ కూడా జాత్యహంకార వ్యాఖ్యలు..

అయితే.. కమలా హారిస్ పై ట్రంప్ మద్దతుదారులే కాదు.. డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కొన్నేళ్ళ కిందటి దాకా ఆమె నల్లజాతీయురాలని తనకు తెలియదని.. ఇప్పుడు ఆమె తాను నల్లజాతీయురాలినని చెప్పుకుంటున్నారని.. ‘‘ఆమె భారతీయురాలా, నల్లజాతీయురాలా? నాకు తెలియదు’ అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారాయి.. అయితే.. ట్రంప్‌ జాత్యహంకార వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్.. పాతకాలపు విభజనపూరిత, అగౌరవ ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి కమలా హారిస్ నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తన జాతి మూలాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు.. ‘సీఎన్‌ఎన్‌’తో మాట్లాడిన ఆమె.. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోని మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటానని.. పాలనలో మార్క్, మార్పును చూపిస్తానంటూ పేర్కొన్నారు.

మొత్తానికి కమలా హారిస్ ప్రచారానికి రోజురోజుకు విశేష ఆదరణ లభిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే బైడెన్ తో సహా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం మద్దతు ప్రకటించడం.. డెమోక్రాట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటం.. సర్వేలు కూడా కమలా వైపు మొగ్గుచూపుతుండటం.. సంచలనంగా మారింది.

అంతేకాకుండా.. అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్‌ సెప్టెంబర్‌ 10న ముఖాముఖిగా తలపడనున్నారు.. ఈ భేటీ సగం గెలుపును నిర్ధారిస్తుంది.. అందుకే.. వీరిద్దరి మధ్య జరగబోయే డిబేట్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఏదిఏమైనప్పటికీ.. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిచినా.. ఓడినా ప్రభంజనమే అవుతుందని రాజకీయ వేత్తలు పేర్కొనడం అంచనాలను మరింత పెంచుతోంది..

అసలేంటి నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌.. కమలా హారిస్‌పై కావాలనే..
అసలేంటి నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌.. కమలా హారిస్‌పై కావాలనే..
పామాయిల్‌ తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
పామాయిల్‌ తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ
హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు.. వీడియో
హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు.. వీడియో
వరదలో చిక్కుకున్న గిరిజనలను రక్షించిన పోలీసులు.. సర్వత్రా హర్షం
వరదలో చిక్కుకున్న గిరిజనలను రక్షించిన పోలీసులు.. సర్వత్రా హర్షం
ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా
ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా
ఆ స్టార్ హీరోపై వేధింపుల కేసు..
ఆ స్టార్ హీరోపై వేధింపుల కేసు..
శభాష్ పోలీసన్న.. అధికారులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
శభాష్ పోలీసన్న.. అధికారులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేబుతోంది..
హెల్తీ ఫుడ్ అంటే ఏంటి.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేబుతోంది..
ముద్దు పెట్టుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలా..? ప్రూఫ్స్ ఎలా తేవాలి
ముద్దు పెట్టుకున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలా..? ప్రూఫ్స్ ఎలా తేవాలి