Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి..ఈసారి ఎవరికంటే..?
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి జాన్ హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లకు వరించింది. మంగళవారం స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని జాన్ హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లకు ప్రకటించింది.
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి జాన్ హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లకు వరించింది. మంగళవారం స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని జాన్ హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ హింటన్‌లకు ప్రకటించింది. మెషీన్ లెర్నింగ్‌కు ఆధారమైన పద్ధతులను అభివృద్ధి చేయడానికి భౌతిక సాధనాలను ఉపయోగించినందుకు వారికి పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబల్ బృందం తెలిపింది.
జాన్ హాప్‌ఫీల్డ్ డేటాలో ఇమేజ్‌లు, ఇతర నమూనాలను నిల్వ చేయడం, పునర్నిర్మించగల అనుబంధ మెమరీని సృష్టించారు. జాఫ్రీ హింటన్ డేటాలోని లక్షణాలను స్వయంచాలకంగా కనుగొనగల ఒక పద్ధతిని కనుగొన్నారు. స్పిన్నింగ్ ఎలక్ట్రాన్‌ల్లో ముగ్గురు శాస్త్రవేత్తలకు గత సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించిన సంగతి తెలిసిందే.