Watch: భూకంపంతో వణికిపోయిన జపాన్.. ఇవిగో ఆ భయానక దృశ్యాలు.. వీడియోలు వైరల్
జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. భూకంప కేంద్రం మిసావా నగరానికి ఈశాన్యంగా దాదాపు 70 నుండి 73 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం చాలా బలంగా ఉండటం వలన అనేక ప్రాంతాలలో భవనాలు కంపించాయి. భయాందోళనలు కలిగించాయి. భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జపాన్ మరోమారు వినాశకరమైన భూకంపంతో అతలాకుతలమైంది. జపాన్ ఈశాన్య తీరంలో సోమవారం రాత్రి 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. భూకంప కేంద్రం మిసావా నగరానికి ఈశాన్యంగా దాదాపు 70 నుండి 73 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం చాలా బలంగా ఉండటం వలన అనేక ప్రాంతాలలో భవనాలు కంపించాయి. భయాందోళనలు కలిగించాయి. భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
🚨 BREAKING: A massive 7.6 magnitude earthquake has struck near Japan. Tsunami warning issued.#Japan #earthquake #Tsunami pic.twitter.com/LMTIOttlhz
— TRIDENT (@TridentxIN) December 8, 2025
సునామీ హెచ్చరిక జారీ:
హచినోహే నగరంలో భూకంపం షిండో స్కేల్‌పై గరిష్టంగా 6గా నమోదైందని, ఇది చాలా శక్తివంతమైనదని భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. హొక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్లకు వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. మూడు మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి.. మియాగి, ఫుకుషిమా ప్రిఫెక్చర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరప్రాంత నివాసితులు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు కోరారు. భూకంపం కారణంగా పసిఫిక్ తీరప్రాంత కమ్యూనిటీలలో 23 మంది వరకు గాయపడినట్టుగా అధికారులు వెల్లడించారు.
వీడియో ఇక్కడ చూడండి..
That was more than a minute.. #Earthquake #Japan pic.twitter.com/dO7lNOGAVm
— Vannida Joane M. 🐝 (@BumbleVeej) December 8, 2025
అమోరి ప్రాంతం తీరానికి దాదాపు 80 కి.మీ దూరంలో, 50 కి.మీ (31 మైళ్ళు) లోతులో 23:15 (14:15 GMT) గంటలకు భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. దీని వలన సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఎత్తివేశారు, 70 సెం.మీ (27 అంగుళాల) ఎత్తులో అలలు కనిపించాయి. మరో వారం పాటు ఈ భూ ప్రకంపన ప్రభావం ఉంటుందని, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
BREAKING: Shocking footage of 7.5 magnitude earthquake in Japan with residents fleeing! pic.twitter.com/KMG7anTd8N
— Maririn~ (@TopGyaru) December 8, 2025
వీడియో ఇక్కడ చూడండి..
భూమి కంపించిన సమయంలో పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ద్వారా తెలుస్తోంది. ఇంత పెద్ద భూకంపాన్ని ఎప్పుడూ చూడలేదంటూ అమోరిలోని ఒక కన్వీనియన్స్ స్టోర్ యజమాని నోబువో యమడా అన్నారు. అదృష్టవశాత్తూ తమ ప్రాంతంలో విద్యుత్ లైన్లకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని చెప్పారు. వారి స్టోర్‌లో రికార్డైన సీసీ ఫుటేజ్‌ను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ దృశ్యాలు సైతం వైరల్ అవుతున్నాయి.
Japan: The moment the M7.6 earthquake hit Hachinohe City – captured from the Aomori Asahi Broadcasting Hachinohe branch office 👀pic.twitter.com/ppJdYIxwoo
— Volcaholic 🌋 (@volcaholic1) December 8, 2025
అక్టోబర్‌లో కూడా శక్తివంతమైన భూకంపం :
టెలివిజన్ ఛానెళ్లు నిరంతర హెచ్చరికలను ప్రసారం చేస్తున్నాయి. అత్యవసర సేవలు ప్రారంభించబడ్డాయి. ఈ సమయంలో ఎటువంటి పెద్ద నష్టం లేదా ప్రాణనష్టం నిర్ధారించబడలేదు. అక్టోబర్ ప్రారంభంలో జపాన్ తూర్పు తీరంలో 6.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే, అప్పుడు ఎటువంటి నష్టం జరగలేదు. జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవించడం కొనసాగుతూనే ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




