గాజా సిటీపై మళ్ళీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు……పరస్పరం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన

| Edited By: Anil kumar poka

Jun 16, 2021 | 10:21 AM

Israel Gaza violence: గాజాసిటీపై ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై పాలస్తీనా పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్లను (రాకెట్లవంటివి) ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకారానికి దిగింది. ఉభయ పక్షాల మధ్య కాల్పుల..

గాజా సిటీపై మళ్ళీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు......పరస్పరం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన
Israel Launches Air Strikes On Gaza City
Follow us on

గాజాసిటీపై ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై పాలస్తీనా పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్లను (రాకెట్లవంటివి) ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకారానికి దిగింది. ఉభయ పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల తరువాత మొదటిసారిగా తిరిగి వీటి మధ్య పోరు ప్రారంభమైంది. మంగళవారం తూర్పు జెరూసలెంలో ఇజాయెలీలు భారీ ప్రదర్శన నిర్వహించడాన్ని హమాస్ ఉగ్రవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా ఆ సందర్బంగా హమాస్ కాంపౌండ్స్(శిబిరాలపై) ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడింది. గాజాలో ఉగ్రవాద చర్యలు కొనసాగుతూనే ఉన్న పక్షంలో తాము కూడా సహించేది లేదని సైన్యం హెచ్చరించింది. దీంతో రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ రేగాయి. గాజా సిటీ నుంచి హమాస్ టెర్రరిస్టులు రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయెల్ పాలస్తీనా;లోని ప్రధాన నగరాలను టార్గెట్లుగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తిరిగి మొదటిసారిగా వీటి మధ్య వైషమ్యాలు తలెత్తాయి.

గత మే 21 న వీటి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే అది ఎంతోకాలం కొనసాగలేదు. అంతకుముందు జరిగిన పోరులో 250 మంది పాలస్తీనీయులు మరణించారు. వీరిలో 66 మంది పిల్లలు కూడా ఉన్నారు. హమాస్ దాడుల్లో 5 ఏళ్ళ బాలుడితో సహా 13 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు. వీటి మధ్య తిరిగి తలెత్తిన పోరుపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరింది. ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా బెనెట్ పదవి స్వీకరించిన మరునాడే ఈ ‘యుద్ధ మేఘాలు’ ఆవరించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.

 స్వచ్ఛందంగా రక్తదానం చేసిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్… ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.:Sachin Donates Blood video.

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.

యూకే లో డెల్టా వేరియంట్ డేంజర్..మళ్ళీ విజృంభిస్తూన్నా తరుణంలో ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం :Delta Variant Video..