Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India – Maldives Row: చైనా అండతో వానపాము బుసలుకొట్టింది.. మోదీ దెబ్బకు మాల్దీవుల మాడు పగిలింది!

మన ప్రధాని లక్షద్వీప్ పర్యటన విషయంలో కుప్పిగంతులు వేసి.. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తే ఇండియన్స్ ఊరుకుంటారా... ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఎక్కడ మనవాళ్లు వాళ్ల దేశానికి రారో అని భయపడుతోంది. అయినా మాట్లాడే ముందే.. కాస్త ముందూ వెనకా చూసుకోవాలి.

India - Maldives Row: చైనా అండతో వానపాము బుసలుకొట్టింది.. మోదీ దెబ్బకు మాల్దీవుల మాడు పగిలింది!
Maldives is India
Janardhan Veluru
|

Updated on: Jan 08, 2024 | 3:50 PM

Share

మోదీనా.. మజాకా.. మన టూరిజం మీద బతుకుతూ.. మాల్దీవులు ఎగిరెగిరి పడింది. చైనా అండ చూసుకుని మనపైనే తొడకొడదామని ప్రయత్నించి దెబ్బతింది. ఇప్పుడు కొట్టడానికి తొడ కాదు.. చేతిలో తడే లేకుండా పోయే ప్రమాదం ఎదురైంది. అది బతికేదే టూరిజం మీద. అలాంటిది మన ప్రధాని లక్షద్వీప్ పర్యటన విషయంలో కుప్పిగంతులు వేసి.. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తే ఇండియన్స్ ఊరుకుంటారా… ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఎక్కడ మనవాళ్లు వాళ్ల దేశానికి రారో అని భయపడుతోంది. అయినా మాట్లాడే ముందే.. కాస్త ముందూ వెనకా చూసుకోవాలి. నోరు దాటితే ఊరు దాటుతుంది అని తెలియదా? అందుకే మాల్దీవుల పాలకుల పరిస్థితి… ఎలా ఉందంటే.. మనమో సామెత చెబుతాం చూడండి.. కుడితిలో పడ్డ ఎలుక అన్న చందంగా మారిపోయింది. అందుకే మాల్దీవులు బైకాట్ అంటూ గూగుల్ లో ట్రెండ్ అవుతోంది. ఇండియన్స్ దెబ్బ అలా ఉంటుంది మరి.

మాల్దీవుల వార్షిక ఆదాయం దాదాపు రూ.29 వేల కోట్లు ఉంటుంది. ఆ చిన్న దేశానికి అది ఓకే. కానీ ఏటేటా పెరుగుతున్న సముద్రమట్టాన్ని చూసి భయపడే ఆ దేశం.. ఇప్పుడు చైనా అండ చూసుకుని మనపైనే బుసలు కొట్టడానికి ప్రయత్నించింది. ఈ మధ్య ప్రధాని నరేంద్రమోదీ.. మన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్ కు వెళ్లారు. అక్కడే సముద్రపు ఒడ్డున కాసేపు కలియదిరిగారు. స్నార్కెలింగ్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందుకే సాహస యాత్రను కోరుకునే వారు తమ లిస్ట్ లో లక్షద్వీప్ ను కూడా కలపుకోమని చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలా చెప్పారంటే కేవలం సరదా కోసమో, సంతోషం కోసమో కాదు.. దాని వెనుక మాస్టర్ స్ట్రాటజీ ఉంటుంది కదా. దానిని అర్థం చేసుకోని మాల్దీవుల మంత్రులు.. మోదీ పర్యటనపై పిచ్చి ప్రేలాపనలతో విరుచుకుపడ్డారు.

మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆమెకు తగిన శాస్తి జరిగింది. లక్షద్వీప్ లో ప్రధాని మోదీ ఉన్న ఒక వీడియోను ఉద్దేశిస్తూ.. అనుచితంగా కామెంట్ చేశారు. దీనిపై భారత్ లో వివిధ వర్గాలు భగ్గుమన్నాయి. బాలీవుడ్ కూడా తీవ్రంగానే స్పందించింది. అక్షయకుమార్ అయితే మన దీవుల్లో పర్యటించి.. మన టూరిజాన్ని సపోర్ట్ చేద్దామని చెప్పేశారు. లక్షద్వీప్ లో మోదీ పర్యటించడం బాగుందని.. అలాంటి పర్యాటక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయంటూ సల్మాన్ అన్నారు. సెలబ్రెటీలు కూడా ఈ స్థాయిలో స్పందించేసరికీ ఒక్కసారిగా అందరి దృష్టి మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై పడింది. నెటిజన్లు అయితే మాల్దీవుల మంత్రుల కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. తాము ఆ దేశానికి వెళ్లాలనుకుని హోటళ్లు బుక్ చేసుకున్నామని వాటిని వెంటనే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు.

భారత్ నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చేసరికీ మాల్దీవుల సర్కార్ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఓరి నాయనో.. ఇదెక్కడ తమ కొంపముంచుతుందో అని భయపడింది. అందుకే జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. మరియం వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమంటూ చెప్పింది. ప్రభుత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదంటూ ఆ మంత్రిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరియంతోపాటు ఇతర మంత్రులు మల్షా షరీఫ్, మజీద్ ను సస్పెండ్ చేసింది. చేసిన తప్పును సస్పెన్షన్ ఆర్డర్ తో కడిగేయాలనుకున్నా దానికి సాధ్యం కావడం లేదు.

మాల్దీవుల టూరిజాన్ని మన పర్యాటకంతో పోలుస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలను నిజంగా ఖండించాల్సిందే. వాళ్ల దేశం వాళ్లకు గొప్ప అయితే మన దేశం మనకు చాలా చాలా గొప్ప. అందుకే మరియం షియునా వ్యాఖ్యలపై మన దేశం కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈమధ్య మాల్దీవులు తోక జాడిస్తున్నట్టే కనిపిస్తోంది. కిందటేడాది నవంబర్ లో అక్కడ అధ్యక్ష పదవిని మొహమ్మద్ ముయిజ్జూ చేపట్టారు. అప్పటి నుంచి దాని వాయిస్ లో తేడా వచ్చింది. అప్పటివరకూ ఇండియా ఫస్ట్ నినాదం, విధానం కాస్తా మారిపోయింది. చైనాపై ప్రేమను పెంచుకుంది. మాల్దీవులు.. హిందూ మహాసముద్రంలో కాస్త వ్యూహాత్మక ప్రాంతంలో ఉంటాయి. అందుకే మనపై దాడి చేసేందుకు వీలుగా ఉంటుందని… చైనా దానికి సపోర్ట్ ఇస్తోంది. అంతే.. డ్రాగన్ అండదండలు చూసుకుని ఇప్పుడది రెచ్చిపోతోంది.

మాల్దీవులతో పోలిస్తే మన లక్షద్వీప్ ఆదాయం తక్కువే ఉండొచ్చు. పర్యాటకంగా అంత అభివృద్ధి లేకపోవచ్చు. కానీ మోదీ అక్కడికి వెళ్లిన తరువాత చాలామంది గూగుల్ లో దాని గురించి వెదికారు. ఢిల్లీ నుంచి లక్ష ద్వీప్ కు ఎలా చేరుకోవాలి.. లక్ష ద్వీప్ కు ఎలా వెళ్లాలి.. లక్షద్వీప్ కు ఫ్లైట్ లో ఎలా వెళ్లాలి..ఇలా వివిధ రకాలుగా సెర్చ్ చేశారు. మొత్తానికి మోదీ టూర్ తో లక్షద్వీప్ దశ మారనుంది. అదే సమయంలో నోరు జారిన మాల్దీవులకు మాడు పగిలింది.

-UV గున్నేశ్వరరావు, టీవీ9 తెలుగు

గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు