AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-China Relation: భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. లడఖ్‌లో భారత బలగాలను రెచ్చగొట్టేందుకు ప్లాన్..

జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్‌ను, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా ఐక్యరాజ్యసమితిని(United Nations) చైనా అడ్డుతగలడం.. ఈ ప్రభావం భారత్,చైనా మధ్య మరోసారి దూరం పెంచింది.

India-China Relation: భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. లడఖ్‌లో భారత బలగాలను రెచ్చగొట్టేందుకు ప్లాన్..
China
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2022 | 9:20 PM

Share

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీని ప్రభావం రెండు దేశాల సంబంధాలపై కూడా కనిపిస్తోంది. చైనా మరోసారి తన ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్న అమెరికా, భారత్ ప్రతిపాదనను చైనా అడ్డుకున్న సమయంలో తూర్పు లడఖ్‌లో భారత బలగాలను రెచ్చగొట్టేందుకు చైనా యుద్ధ విమానాలను దిపింది. భారత్-చైనా సైనిక చర్చల్లో కూడా ఈ ఘటన ప్రస్తావన వచ్చినా చైనా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. వాస్తవానికి, LAC సమీపంలో సైనిక-వాయుసేన కార్యకలాపాల నివేదికపై, భారతదేశంలోని చైనా రాయబారి సన్ వీడాంగ్, ‘భారత్, చైనా మధ్య సంతకం చేసిన ఒప్పందాల ప్రకారం సరిహద్దులో అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

ఏ ఉద్యమం గురించి నా వద్ద నిర్దిష్ట సమాచారం లేదు. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉంది. ఢిల్లీలోని చైనా రాయబారి సన్ వీడాంగ్‌ను UNSCకి అమెరికా- భారత్ ప్రశ్నించింది. “ఉగ్రవాద హోదాపై దరఖాస్తును జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి చైనాకు మరింత సమయం కావాలి” అని కోరింది. 

ఐక్యరాజ్యసమితిలో జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజార్‌ను బ్లాక్ లిస్ట్ చేయాలనే అమెరికా, భారతదేశ ప్రతిపాదనను ఆగస్టు 12 న చైనా నిరోధించింది. అప్లికేషన్‌ను అధ్యయనం చేయడానికి మరింత సమయం కావాలని చైనా పేర్కొంది. సరిగ్గా ఈ రాగాన్ని న్యూ ఢిల్లీలో చైనీస్ రాజ్‌దత్  ఎత్తుకున్నారు. అయితే, భద్రతా మండలిలోని ఇతర 14 సభ్య దేశాలన్నీ భారత్, అమెరికాల ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి.

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం