AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్రాన్ ! మీ స్పీచ్ అంతా విషపూరితం.. నిప్పులు చెరిగిన భారత్

ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పై భారత్ నిప్పులు చెరిగింది. ఆయన వైఖరి.. బెదిరించి తప్పుకునే.. అత్యంత ప్రమాదకరమైన నేత ప్రసంగం మాదిరే ఉంది తప్ప.. రాజనీతిజ్ఞుడైన వ్యక్తి స్పీచ్ లా లేదని మండిపడింది. రెండు అణ్వస్త్ర దేశాలు తలపడితే దాని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలన్నిటిపైనా పడుతుందన్న ఆయన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. పైగా ఇమ్రాన్ తన ప్రసంగంలో పలుమార్లు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన […]

ఇమ్రాన్ ! మీ స్పీచ్ అంతా విషపూరితం.. నిప్పులు చెరిగిన భారత్
Anil kumar poka
| Edited By: |

Updated on: Sep 28, 2019 | 5:51 PM

Share

ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పై భారత్ నిప్పులు చెరిగింది. ఆయన వైఖరి.. బెదిరించి తప్పుకునే.. అత్యంత ప్రమాదకరమైన నేత ప్రసంగం మాదిరే ఉంది తప్ప.. రాజనీతిజ్ఞుడైన వ్యక్తి స్పీచ్ లా లేదని మండిపడింది. రెండు అణ్వస్త్ర దేశాలు తలపడితే దాని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలన్నిటిపైనా పడుతుందన్న ఆయన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. పైగా ఇమ్రాన్ తన ప్రసంగంలో పలుమార్లు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన స్పీచ్ పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తొలి కార్యదర్శి విదిషా మిత్రా..తీవ్రంగా స్పందిస్తూ.. ఇమ్రాన్ ప్రసంగమంతా చౌకబారుగా ఉందన్నారు. అది ప్రపంచ దేశాలను నిర్లక్ష్యం చేసేదిగా.. ధనికులు, పేదలు, ఉత్తరం, దక్షిణ దిక్కుల మధ్య వైరుధ్యంలా, అలాగే ముస్లిములు, ఇతరుల మధ్య భిన్నత్వం లా.. ఆయా దేశాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని.. ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో ద్వేషాన్ని రెచ్చగొట్టే స్క్రిప్ట్ మాదిరి ఉందని ‘ అభివర్ణించారు ‘.

అసలు ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు ? ‘ రెండు దేశాల మధ్య సంప్రదాయ యుధ్ధం జరిగితే ఏమవుతుంది ? ఏదైనా జరగవచ్చు. అయితే తన పొరుగు దేశం కన్నా ఏడింతలు చిన్నదైన ఒక దేశం అలాంటి పరిస్థితినే ఎదుర్కోవలసివస్తే.. అది లొంగిపోవాలి…లేదా తుది మరణం వరకు పోరాడాలి. కానీ.. పోరాడాలనే నేను తలిచాను. గాడ్ లేడని భావించే నేను ఒక అణ్వస్త్ర దేశంతో తుదికంటా ఫైట్ చేయాలనే భావించాను. ఇది సరిహద్దులను మించితే తీవ్ర పరిణామాలు ఉంటాయి ‘.. అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ పదజాలాన్ని తీవ్రంగా తప్పు పట్టిన విదిషా మిత్రా.. ఐక్యరాజ్యసమితిలో ఈ విధమైన అనుచిత ప్రసంగం చాలా అరుదని అన్నారు. ‘ రక్తపాతం ‘ (బ్లడ్ బాత్), ‘ తుపాకీ చేత పట్టు ‘ (పిక్ ది గన్ ), ‘ ఫైట్ టు ది ఎండ్ ‘ వంటి పదాలు 21 వ శతాబ్దం ‘ మైండ్ సెట్ ‘ కు సరిపోవు అని ఆమె పేర్కొన్నారు. తమ దేశంలో ఉగ్రవాద సంస్థలు లేవని ఇమ్రాన్ చేసిన ప్రకటనను ప్రస్తావించిన ఆమె.. ఇప్పుడు మీ దేశాన్ని విజిట్ చేయాల్సిందిగా ఐరాస పరిశీలకులను మీరు కోరారని, మీ వాగ్దానం ఎంతవరకు నెరవేరుతుందో చూద్దామని అన్నారు. ఐరాస ముద్ర పడిన 130 మంది ఉగ్రవాదులు, 25 టెర్రరిస్టు సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్నామన్న విషయాన్ని మీరు తోసిపుచ్చగలరా అని ప్రశ్నించారు. కరడు గట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు మీరు బాహాటంగా మద్దతుదారుడన్నఅంశాన్ని కాదనగలరా అని కూడా విదిషా మిత్రా అన్నారు. ఇమ్రాన్ ప్రసంగానికి సమాధానం ఇచ్ఛే హక్కు ఇండియాకు ఉన్న నేపథ్యంలో.. ఆమె ఇలా సుదీర్ఘమైన తన స్టేట్ మెంట్ లో ఇమ్రాన్ ను చెండాడేశారు.