అదంతా గూఢచర్యం.. ట్రంప్ ఎద్దేవా ! రంగంలోకి దిగిన వైట్ హౌస్

తనపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు డెమొక్రాట్లు రెడీ అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వచ్ఛే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి సహాయపడవలసిందిగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదొమిర్ జెలెన్స్కీ ని ఫోన్ లో కోరిన విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి బయటపెట్టాడు. ఆ ఫోన్ కాల్ వ్యవహారాన్ని డెమొక్రాట్లు ట్రంప్ అభిశంసనకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ వ్యక్థిదంతా గూఢచర్యమని, దానికి విలువలేదని ట్రంప్ […]

అదంతా గూఢచర్యం.. ట్రంప్ ఎద్దేవా ! రంగంలోకి దిగిన వైట్ హౌస్
Follow us

|

Updated on: Sep 27, 2019 | 4:05 PM

తనపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు డెమొక్రాట్లు రెడీ అవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వచ్ఛే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి సహాయపడవలసిందిగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదొమిర్ జెలెన్స్కీ ని ఫోన్ లో కోరిన విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి బయటపెట్టాడు. ఆ ఫోన్ కాల్ వ్యవహారాన్ని డెమొక్రాట్లు ట్రంప్ అభిశంసనకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ వ్యక్థిదంతా గూఢచర్యమని, దానికి విలువలేదని ట్రంప్ కొట్టిపారేశాడు. అటు వైట్ హౌస్ కూడా ఇదంతా ట్రాష్ అని అభివర్ణించింది. . ఒక విదేశీ నాయకునితో ట్రంప్ జరుపుతున్నట్టు చెబుతున్న సంభాషణకు అంత ప్రాధాన్యం లేదని తేలిగ్గా పరిగణించింది. ఇదే సమయంలో ఈ కాల్ కు సంబంధించిన ట్రాన్స్ క్రిప్ట్ రికార్డులను మాటు మాయం చేయాల్సిందిగా వైట్ హౌస్ సీనియర్ అధికారులు లాయర్లను కోరారు. అజ్ఞాత వ్యక్తి చేసిన ఫిర్యాదుకు సంబంధించి నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్ జోసెఫ్ మెకూరే.. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు వాంగ్మూలమిస్తూ.. ఈ ఫిర్యాదును ‘ బ్లాక్ ‘ చేయాల్సిందిగా తనకు ఆదేశాలు అందాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదురుకాలేదన్నారు. వచ్ఛే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ పై వఛ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడిని కోరారట. ఈ ఫోన్ కాల్ నే ఆ అజ్ఞాత వ్యక్తి ‘ ట్రేస్ ‘ చేసి.. డెమొక్రాట్లకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది ఇంతవరకూ తెలియలేదు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?