సర్కారీ ఇళ్ల కోసం.. చెల్లినీ, తల్లిని కూడా పెళ్లిచేసుకున్నాడు..!

బీదవారికి.. గవర్నమెంట్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. నిజంగానే కొంతమందికి అవి అందుతూంటాయి. మరికొంతమంది.. దొరికిందే ఛాన్స్ అన్నట్టు రెండు మూడు దఫాలుగా వాటిని అందుకుంటూంటారు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనం వెలుగు చూస్తునే ఉన్నాం. అలాగే.. చైనాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఎంత ఘనకార్యం చేశాడంటే.. షాక్ అవ్వక తప్పదు. అతని పేరు ‘పాన్’.. చైనాలోని జెజియాంగ్‌లో జీవిస్తున్నాడు. అక్కడి ప్రభుత్వం కూడా బీదవారికి పలు అభివృద్ధి పథకాలను చేపట్టింది. అందులో భాగంగా.. ఇల్లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:33 pm, Fri, 27 September 19
సర్కారీ ఇళ్ల కోసం.. చెల్లినీ, తల్లిని కూడా పెళ్లిచేసుకున్నాడు..!

బీదవారికి.. గవర్నమెంట్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. నిజంగానే కొంతమందికి అవి అందుతూంటాయి. మరికొంతమంది.. దొరికిందే ఛాన్స్ అన్నట్టు రెండు మూడు దఫాలుగా వాటిని అందుకుంటూంటారు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనం వెలుగు చూస్తునే ఉన్నాం. అలాగే.. చైనాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఎంత ఘనకార్యం చేశాడంటే.. షాక్ అవ్వక తప్పదు. అతని పేరు ‘పాన్’.. చైనాలోని జెజియాంగ్‌లో జీవిస్తున్నాడు.

అక్కడి ప్రభుత్వం కూడా బీదవారికి పలు అభివృద్ధి పథకాలను చేపట్టింది. అందులో భాగంగా.. ఇల్లు లేని నిర్వాసితులకు 40 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా.. అందరూ వాటికి దరఖాస్తు చేస్తున్నారు. అలాగే.. పాన్ అనే వ్యక్తి కూడా ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్నిసార్లో తెలుసా..? 11 సార్లు.. అలాగే అక్కడి ప్రభుత్వం కూడా అతనికి 11 ఇళ్లు కేటాయించింది. ఏంటి షాక్ అవుతున్నారా..! నిజమేనండి.

వివరాల్లోకి వెళ్తే.. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎక్కడైతే పునరావాసం కల్పిస్తారో.. ఆ ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే.. వారికి ఇల్లును కేటాయిస్తుంది. అలా ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడంటే.. భార్యకు విడాకులిచ్చి.. మరలా ఆరురోజుల్లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ విడాకులిచ్చాడు. ఆ తరువాత వెంటనే అక్కని పెళ్లి చేసుకున్నాడు.. ఆమెకీ విడాకులిచ్చాడు. మరలా.. చెల్లిని, తల్లిని, తన మరదలినీ, అత్తని ఇలా అందరికీ పెళ్లి చేసుకోవడం.. విడాకులు ఇస్తూ వచ్చాడు. ఇంతకీ ఇతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా.. అతని తండ్రి కూడా ఇలానే చేసేవాడట. ఇలా ఇద్దరూ కలిసి 23 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

ఒకేసారి పాన్‌ పేరుపై ఇన్ని ఇల్లులు దాఖలవడమేంటని..? అధికారులు షాక్ తిన్నారు.. లెక్కలు తీస్తే.. గానీ.. ఈ విషయం బయటపడలేదు. పాన్ ఒకే వారంలో.. మూడు ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న విషయం బయటకొచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు పాన్ తీగ లాగితే.. అపార్ట్‌మెంట్ లిస్ట్ కదిలిందన్నమాట. మొత్తం 11 మంది పాన్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో 5గురు జైలులో ఉండగా.. మరికొంతమంది బెయిల్‌పై బయటకొచ్చారు.