క్షుద్రపూజల్లో కలకలం.. పేలుడులో బలి
తమిళనాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. లావణ్య అనే వివాహితతో కలిసి అర్ధరాత్రి గోవిందరాజు అనే స్వామీజీ క్షుద్రపూజలు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ స్వామీజీ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో చోటుచేసుకుంది. చెన్నై నంగనల్లూరు ప్రాంతానికి చెందిన గోవిందరాజ్.. తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో పదిహేనేళ్లుగా ఎకర స్థలంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎరయమంగళం సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు సిద్ధవైద్యం జ్యోతిష్యం, సంప్రదాయ పూజలను […]
తమిళనాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. లావణ్య అనే వివాహితతో కలిసి అర్ధరాత్రి గోవిందరాజు అనే స్వామీజీ క్షుద్రపూజలు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ స్వామీజీ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో చోటుచేసుకుంది. చెన్నై నంగనల్లూరు ప్రాంతానికి చెందిన గోవిందరాజ్.. తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో పదిహేనేళ్లుగా ఎకర స్థలంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎరయమంగళం సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు సిద్ధవైద్యం జ్యోతిష్యం, సంప్రదాయ పూజలను నిర్వహిస్తుండేవాడు. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ స్వామీజీగా పేరు రావడంతో.. చెన్నై ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే 15 రోజుల క్రితం లావణ్య అనే వివాహిత.. ఈ స్వామీజీ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు సిద్ధమవుతున్న సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో వెంటనే పక్క గదిలో వున్న లావణ్య పేలుడు ఏర్పడిన ప్రాంతానికి వచ్చి చూడగా.. గోవిందరాజ్ మంటల్లో కాలిపోవడాన్ని చూసి.. లావణ్య గట్టిగా కేకలు వేస్తూ.. చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. అయితే వారు చేరుకునే లోపే గోవిందరాజ్ సజీవదహనం అయ్యాడు.
లావణ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందరాజ్ మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. పేలుడు జరగడంతో.. అసలు కారణం ఏంటన్న విషయం ఆరా తీసేందుకు పోలీసులు ఫోరెన్సిక్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ నళిని నేతృత్వంలో పోలీసులు గురువారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. గోవిందరాజ్ నిత్యం క్షుద్రపూజలు నిర్వహించేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.