AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నాలుగు నగరాలు మునిగిపోనున్నాయా ? ఎందుకంటే…

ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని నిజం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావణానికి జరుగుతున్న ప్రమాదం మనల్ని ప్రకృతి విపత్తులకు గురిచేస్తూనే ఉంది. దీనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే కరిగిపోతున్న హిమాలయపర్వతాలో సముద్ర నీటిమట్టం క్రమంగా పెరిగి పరిస్థితి రానుందని ఐక్యరాజ్య సమితి నియమించిన వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ( ఐపీసీసీ) ఒక నివేదికలో హెచ్చరించింది. మన దేశంలో ఉన్న పలు సముద్రమట్టాలు పెరిగే అవకాశాలున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా […]

ఆ నాలుగు నగరాలు మునిగిపోనున్నాయా ? ఎందుకంటే...
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 27, 2019 | 4:48 AM

Share

ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని నిజం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావణానికి జరుగుతున్న ప్రమాదం మనల్ని ప్రకృతి విపత్తులకు గురిచేస్తూనే ఉంది. దీనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే కరిగిపోతున్న హిమాలయపర్వతాలో సముద్ర నీటిమట్టం క్రమంగా పెరిగి పరిస్థితి రానుందని ఐక్యరాజ్య సమితి నియమించిన వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ( ఐపీసీసీ) ఒక నివేదికలో హెచ్చరించింది.

మన దేశంలో ఉన్న పలు సముద్రమట్టాలు పెరిగే అవకాశాలున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా కోల్‌కతా, ముంబై, సూరత్, చెన్నై నగరాలకు సముద్రజలాలు ముంపు సమస్య రానుంది. హిమాలయాల్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో మంచు పర్వతాలు కరిగిపోవడం దీనికి కారణం. ఒక వైపు మంచు పర్వతాలు కరిగిపోవడంతో సముద్ర మట్టం పెరుగుతుంది. అలాగే ఉత్తరాది ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశాలున్నాయట. హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ముంచుపై భూతాపం పడినందున సముద్ర జలాల మట్టం కూడా పెరుగుతుంది.

దీనితోపాటు తుపాన్ల ప్రభావం కూడా అధికంగా ఉండటం వల్ల భారీ వర్షాలుతో ప్రకృతి మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్తితికి దారితీస్తుందనిఐపీసీసీ నివేదిక వెల్లడించింది. కేవలం మన భారత్‌లోని నాలుగు నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 45 నగరాల్లో సముద్రజలాల నీటిమట్టం గణనీయంగా పెరగుతుందని పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే మన భూభాగంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, మాల్దీవులు ప్రజలు జీవించడానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవంటూ ఆ నివేదికలో వెల్లడించారు. పర్యావరణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా .. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం, స్వార్ధ పూరితంగా ఆలోచించడంతోనే ఇటువంటి ఉపద్రవాలు సంభవిస్తాయని కూడా నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
నువ్వు నాకు నచ్చావ్’ 'సినిమా రిలీజై 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
నువ్వు నాకు నచ్చావ్’ 'సినిమా రిలీజై 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్..
ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
ఢిల్లీలో కూలిన భవనం.. శిథిలాల కింద సుమారు చాలా మంది విద్యార్థులు!
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!
విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!