PAK PM: చైనా నుంచి నేర్చుకోవాలి… వారి పురోగతి మాకెంతో ఆదర్శం.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…

‘ప్రపంచంలో ఏదైనా దేశం నుంచి నేర్చుకోవాలనుకుంటే, అది ఒక్క చైనా నుంచే నేర్చుకోవాలని, వారి అభివృద్ధి విధానం పాకిస్థాన్‌కు ఎంతో అనుగుణంగా ఉంటుందని పాకిస్థాన్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

PAK PM: చైనా నుంచి నేర్చుకోవాలి... వారి పురోగతి మాకెంతో ఆదర్శం.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 02, 2021 | 2:39 AM

‘ప్రపంచంలో ఏదైనా దేశం నుంచి నేర్చుకోవాలనుకుంటే, అది ఒక్క చైనా నుంచే నేర్చుకోవాలని, వారి అభివృద్ధి విధానం పాకిస్థాన్‌కు ఎంతో అనుగుణంగా ఉంటుందని పాకిస్థాన్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో చైనా సాధించిన పురోగతి నుంచి తామెంతో నేర్చుకోవాలని అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టంచేశారు.

పేదరిక నిర్మూలనే నిజమైన అభివృద్ధి అనే విషయాన్ని బీజింగ్‌ నిరూపించిందని పాక్‌ ప్రధాని కొనియాడారు. పరిశ్రమల వృద్ధి, ప్రత్యేక ఎగుమతి జోన్లు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి వ్యూహాలతో చైనా సంపదను సృష్టిస్తోందని అన్నారు. అలా వచ్చిన డబ్బును అక్కడి పేదరిక నిర్మూలనకు వినియోగిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇక చైనా కంపెనీలను ఆకర్షించేందుకు పాకిస్థాన్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తామని..అక్కడి నుంచే పాకిస్థాన్‌కు ఎగుమతులు చేయనున్నట్లు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. ప్రస్తుత సంవత్సరం దేశంలో పారిశ్రామికాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఇక కరోనా కారణంగా 2020లో పాకిస్థాన్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ఇమ్రాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

Also Read: Pawan Kalyan: పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తుంటారని చదివాం… ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఆలయాలపై దాడులు…