Six Times Winner: ఇతన్ని అదృష్టానికి అంబాసిడర్ అనాలేమో.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా..
Six Times Winner: ఒకసారి లాటరీ టికెట్ గెలిస్తే అదృష్టం కలిసొచ్చిందంటాం. రెండోసారి కూడా లాటరీ కలిసొస్తే.. మహర్జాతకుడు అంటాం.
Six Times Winner: ఒకసారి లాటరీ టికెట్ గెలిస్తే అదృష్టం కలిసొచ్చిందంటాం. రెండోసారి కూడా లాటరీ కలిసొస్తే.. మహర్జాతకుడు అంటాం. అలా మూడు, నాలుగు, ఐదు, ఆరోసారి కూడా లాటరీ తగిలితే.. కచ్చితంగా అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావించాల్సిందే. అలాంటి బ్రాండ్ అంబాసిడరే అమెరికాలో ఉన్నాడు. అతను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు లాటరీ టికెట్లు గెలుచుకుని కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకెళితే.. అమెరికాలోని ఐడాహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్‌కు గేమ్స్ ఆడే అలవాటు ఉంది. అలా గేమ్స్ ఆడుతూ లాటరీలు పొందేవాడు. అయితే పలు గేమ్స్ ఆడి దాదాపు ఐదుసార్లు లాటరీని గెలుచుకున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా ‘క్రాస్ వర్డ్ స్క్రాచ్’ గేమ్ ఆడుతూ లాటరీని గెలుచుకున్నాడు. అయితే ఈసారి.. మునుపటిలా కాకుండా భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ గెలiపొందాడు. ఆరో దఫా లాటరీలో 2.5 లక్షల డాలర్లు సొంతం చేసుకున్నాడు. వీటి విలువ భారత కరెన్సీలో సుమారు రూ.182 కోట్లు ఉంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. బ్రియాన్ తాను గెలుచుకున్న సొమ్మును ఏనాడు తనకోసం వినియోగించలేదు. తన జల్సాల కోసం దుబారా చేయలేదు. లాటరీల ద్వారా వచ్చిన సొమ్మునంతా సమాజ సేవకే వినియోగిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. స్కూళ్లు, కాలేజీలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఏది ఎలా ఉన్నా ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం చాలా అరుదు కదా!
Also read:
Fish Stuck in Man Throat: చేపను నోట్లో పెట్టుకున్న యువకుడు.. అది కాస్తా గొంతులోకి జారడంతో..
October 1st Release: ఫస్ట్ లుక్ లేదు, టైటిల్ లేదు.. కానీ సినిమా విడుదల తేదీని ప్రకటించారు..