Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Helpline: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు!

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాలలో నివసిస్తున్న తెలంగాణ పౌరుల భద్రత, సంక్షేమం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆయా దేశాల్లోని పౌరులకు ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Govt Helpline: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు!
Israel Iran Conflict
Anand T
|

Updated on: Jun 17, 2025 | 7:37 PM

Share

ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడుకుతుంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత ఐదు రోజులుగా జరుగుతున్న భీకర యుద్దంతో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా రెండు దేశాలు తగ్గేదేలే అంటున్నారు. పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలుగు విద్యార్థుల భద్రతపై వారి కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో వారిని వెంటనే తిరిగి భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో నివసించే తెలంగాణ పౌరుల భద్రతపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాల్లో నివసించే తెలంగాణ పౌరులకు అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేందుకు నలుగురు కీలక అధికారులు ప్రభుత్వం నియమించింది. బాధితులు ఫోన్‌ చేసి వివరాలు తెలిపేందుకు అధికారుల వారి ఫోన్ నంబర్లను కూడా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో ఉన్న సీనియర్ అధికారుల సమన్వయంతో పనిచేసే ఈ హెల్ప్‌లైన్, విదేశాలలో ఉన్న తెలంగాణ పౌరుల భద్రతపై కుటుంబసభ్యుల ప్రశ్నలకు సమాధానాలు అందించడంతో పాటు వారి మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయనుంది.

విదేశాల్లోని తెలంగాణ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా సమాచారం కోసం సంప్రదించాల్సిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..

  • వందన ఐపీఎల్, పీఎస్‌ రెసిడెంట్ కమిషనర్: +91 98719 99044
  • జి రక్షిత్ నాయక్ , లైజన్ ఆఫీసర్: +91 96437 23157
  • జావేద్ హుస్సేన్ , అనుసంధాన అధికారి: +91 99100 14749
  • CH చక్రవర్తి , పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: +91 99493 51270

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో