Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్‌ను మించిన మహమ్మారి.. పెను ముప్పు తప్పదంటున్న నిపుణులు

కొవిడ్‌ను మించిన మహమ్మారి.. పెను ముప్పు తప్పదంటున్న నిపుణులు

Phani CH
|

Updated on: Jun 17, 2025 | 4:01 PM

Share

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోకముందే, చైనా నుంచి మరో పెను ప్రమాదం పొంచి ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ చైనా వ్యవహారాల నిపుణుడు గార్డన్ జి. చాంగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోకి అత్యంత ప్రమాదకరమైన ఫంగస్‌ను అక్రమంగా తరలించేందుకు ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు యత్నించిన ఘటన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తక్షణమే చైనాతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోకపోతే, కోవిడ్-19 కంటే దారుణమైన పరిణామాలను అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. యున్కింగ్ జియాన్ , జున్యోంగ్ లియు అనే ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు ‘ఫ్యూసారియం గ్రామినియారం’ అనే విషపూరిత ఫంగస్‌ను అమెరికాలోకి స్మగ్లింగ్ చేసేందుకు కుట్ర పన్నారని అమెరికా న్యాయ విభాగం కేసు నమోదు చేసింది. ఈ ఫంగస్ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటలపై ‘హెడ్ బ్లైట్’ అనే తీవ్ర వ్యాధిని కలుగజేస్తుంది. దీనిని ‘వ్యవసాయ తీవ్రవాదానికి ఉపయోగపడే ఆయుధం’గా అధికారులు వర్గీకరించారు. ఈ ఫంగస్ వల్ల ఏటా బిలియన్ల డాలర్ల పంట నష్టం వాటిల్లడమే కాకుండా, మనుషులు, పశువులలో వాంతులు, కాలేయ సంబంధ వ్యాధులు, పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై మాట్లాడుతూ గార్డన్ చాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికాపై చైనా చేస్తున్న యుద్ధ చర్యతో సమానం. మే 2019లోనే చైనా అధికారిక మీడియా అమెరికాపై ‘ప్రజాయుద్ధం’ ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నిత్యం యుద్ధం గురించే మాట్లాడుతున్నారు, చైనా సమాజాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు” అని చాంగ్ ఆరోపించారు. గతంలో 2020లో అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు చైనా నుంచి గుర్తుతెలియని విత్తనాలు వచ్చాయని, ఇప్పుడు టిము వంటి ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. చైనాతో తక్షణమే సంబంధాలు తెంచుకోవాలి. లేకపోతే మనం కోవిడ్, ఫెంటానిల్‌తోనే కాదు, బహుశా అంతకంటే దారుణమైన దానితో దెబ్బతింటామని చాంగ్ హెచ్చరించారు. ఆయన రెండు దశాబ్దాల పాటు చైనా, హాంగ్‌కాంగ్‌లలో నివసించి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈ తాజా పరిణామం అమెరికా-చైనా సంబంధాలలో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. చింత గింజలకు ఇంత సీన్‌ ఉందా

కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో పరిష్కారం

చంద్ర నమస్కారం గురించి విన్నారా.?రోజూ చేస్తే అనేక లాభాలు

TOP 9 ET News: బాలయ్య ధాటికి బద్దలైన బన్నీ పుష్ప2 రికార్డ్‌

గద్దర్ అవార్డ్స్‌కు డుమ్మా కొట్టిన స్టార్స్‌కు దిల్ రాజు స్వీట్ వార్నింగ్