Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ.. చింత గింజలకు ఇంత సీన్‌ ఉందా

ఓర్నీ.. చింత గింజలకు ఇంత సీన్‌ ఉందా

Phani CH
|

Updated on: Jun 17, 2025 | 3:59 PM

Share

చింతగింజలకు మార్కెట్లో చాలా డిమాండ్​ పెరిగిపోయింది. మీరు కరెక్ట్‌గానే విన్నారు. చింతపండు కాదు.. చింతగింజలే. అవును చింత గింజలను మనం వేస్ట్‌గా తీసి అవతల పడేస్తాం. కానీ ఆ గింజలే కోట్లు కుమ్మరిస్తున్నాయి. వీటిలో చాలా ఔషధగుణాలున్నాయి. అందుకే వీటికి అంత డిమాండ్‌. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు చింత గింజల పొడి మంచి ఔషధం.

అంతేకాకుండా పొరుగు దేశాల్లోని ఫార్మా కంపెనీలు, రంగుల కంపెనీలు, పట్టువస్త్రాల తయారీకి ఈ పొడి విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏటా రూ.కోట్లలో వ్యాపారం సాగే ఈ రంగం వేలాది మందికి ఉపాధి చూపుతోంది. దక్షిణ భారతదేశంలో పేరొందిన వ్యాపారాల్లో చింత గింజల వ్యాపారం ఒకటి. వీటికి ఏడాది పొడవునా డిమాండు ఉన్నా విక్రయించే వారు తక్కువ. ప్రస్తుతం చింతపండు ధరలు పెరుగుతుండటంతో చింతగింజల ధరలూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ వ్యాపారం పుంగనూరు, హిందూపురంలో సాగుతోంది. సాధారణంగా కిలో చింత గింజలు రూ.30 నుంచి 35 ల మధ్య ధర పలికేవి. ఈ ఏడాది కిలో చింత గింజలు రూ.40ల నుంచి రూ.44ల వరకు పలుకుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ నుంచి ఈ చింత గింజలను దిగుమతి చేసుకొని పుంగనూరులో పొట్టు తీస్తారు. పొట్టు తీసే మిషన్లు ఎక్కువగా ఉండేది ఇక్కడే. ఆ గింజలను హిందూపురం, మధురై, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్, వాపి, చెన్నై, బెంగళూరులో పొడి చేసే మిషన్లు ఉన్నాయి. ఒక్క పుంగనూరులో 12 మిషన్ల ద్వారా రోజూ 200 టన్నుల చింత గింజలు పొట్టు తీసేసి ఎగుమతి చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు మందుల తయారీలో, రంగుల తయారీకి, పట్టువస్త్రాలకు గంజి పెట్టడానికి, మస్కిటో కాయిల్స్, పేపర్, ఫ్లైవుడ్, ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి, జూట్‌ పరిశ్రమలో ఈ చింతగింజల పొడిని ఉపయోగిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో పరిష్కారం

చంద్ర నమస్కారం గురించి విన్నారా.?రోజూ చేస్తే అనేక లాభాలు

TOP 9 ET News: బాలయ్య ధాటికి బద్దలైన బన్నీ పుష్ప2 రికార్డ్‌

గద్దర్ అవార్డ్స్‌కు డుమ్మా కొట్టిన స్టార్స్‌కు దిల్ రాజు స్వీట్ వార్నింగ్

‘ఉంటే పద్దతిగా ఉండు.. లేదా అల్ట్రా మోడ్రన్‌గా ఉండు’ అనుష్క డ్రెస్సింగ్‌పై ఆమె తల్లి కామెంట్స్