Google: గూగుల్ కార్యాలయాల్లో పెంపుడు కుక్కలకు అధికారిక అనుమతి ఉంటుంది..ఒక పెంపుడు కుక్క కోసం మ్యూజియం ఏర్పాటు

Google: కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటె పని చేయడం మరింత ఉత్సాహంగా ఉంటుంది. కార్పోరేట్ కంపెనీలు అన్నీ తమ సంస్థలో పనిచేసే వారి వద్ద నుంచి పని తీసుకోవడంతో పాటు.. వారు ఆహ్లాదకర వాతావరణంలో పనిచేసేలా ప్రోత్సహిస్తాయి.

Google: గూగుల్ కార్యాలయాల్లో పెంపుడు కుక్కలకు అధికారిక అనుమతి ఉంటుంది..ఒక పెంపుడు కుక్క కోసం మ్యూజియం ఏర్పాటు
Google
Follow us

|

Updated on: May 25, 2021 | 7:14 PM

Google: కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటె పని చేయడం మరింత ఉత్సాహంగా ఉంటుంది. కార్పోరేట్ కంపెనీలు అన్నీ తమ సంస్థలో పనిచేసే వారి వద్ద నుంచి పని తీసుకోవడంతో పాటు.. వారు ఆహ్లాదకర వాతావరణంలో పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. ఈమేరకు చాలా కంపెనీలు తమ సిబ్బందికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటాయి. అయితే, ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ సంస్థ గూగుల్ ఈ విషయంలో చాలా ముందు ఉంటుంది. తమ సిబ్బందికి అన్ని వసతులనూ కల్పిస్తుంది. అదేవిధంగా వారికి నచ్చిన పద్ధతిలో ఉంటూ పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. విశాలమైన కార్యాలయాలు, పని సంస్కృతి వీటితో పాటు అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుంది గూగుల్.

గూగుల్ తమ కంపెనీలో ఇచ్చే ఒక ప్రత్యేకమైన వెసులుబాటు గురించి తెలుసుకుంటే భలే అనిపిస్తుంది. గూగుల్ తన తన ఉద్యోగులను తమ పెంపుడు జంతువులను కార్యాలయానికి తీసుకురావాలని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని గూగుల్ ప్లెక్స్ ప్రధాన కార్యాలయంలో ఇది తరచూ జరుగుతుంది. గూగుల్ దాని ప్రధాన కార్యాలయంలో టాప్ డాగ్ యోష్కా గౌరవార్ధం ఒక కేఫ్ కూడా ఏర్పాటు చేసింది. గూగుల్ క్యాంపస్ ను సందర్శించిన మొదటి పెంపుడు జంతువు యోష్కా. గూగుల్ లో చాలా కాలం సీనియర్ వీపీ గా పనిచేసిన గూగ్లర్ ఉర్స్ హల్జే తనతో పాటు 1999లో ఈ యోష్కా అనే కుక్కను తీసుకు వచ్చారు. అది వచ్చిన వెంటనే, కార్యాలయంలోని అందరితో కలిసిపోయింది. గూగుల్ పాత బ్లాగులో ఈ విషయాలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి యోష్కా తరచూ గూగుల్ కార్యాలయానికి వచ్చేది. అది అందరికీ అలవాటు అయిపొయింది. యోష్కా 2011లో చనిపోయింది. లియోన్ బర్గర్ లో యోష్కా కోసం ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేశారు. దీనిలో దానికి ఇష్టమైన బొమ్మ, మెత్తటి బంతి, కాలర్, గూగుల్ బ్యాడ్జ్‌ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియం ఒక పోడియంలో చిన్న ఫలకం ఏర్పాటు చేశారు. దానిలో గూగుల్ ను స్నేహపూర్వక సంస్థగా మారడానికి సహయం చేసింది యోష్కా అని రాసి ఉంటుంది.

ఇక గూగుల్ మౌంటెన్ వ్యూ క్యాంపస్‌లోని డాగ్‌ప్లెక్స్ అనే డాగ్ పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు. ఇది 2018 లో సృష్టించబడిన డాగ్లర్ గ్రూప్ . ఇది తప్పనిసరిగా పెంపుడు జంతువులతో ఉన్నవారికి గూగ్లర్ ఉద్యోగుల గ్రూప్. పప్పీ పాప్-అప్స్ వంటి అనేక పెంపుడు జంతువుల సంబంధిత కార్యక్రమాలకు ఈ బృందం బాధ్యత వహిస్తుంది. ఇది కాకుండా అనేక గూగుల్ కార్యాలయాలలో గూగ్లర్స్ కోసం ఒక కుక్కపిల్ల చికిత్స కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది గూగుల్ సంస్థ.

కుక్కలు మాత్రమే కాదు..

పెంపుడు జంతువులపై గూగుల్ ప్రేమ దాని డాగ్లర్లకు మాత్రమే పరిమితం కాదు. సంస్థ తన విధానాలలో పిల్లులను ఇష్టపడుతుందని పేర్కొంది. గూగుల్ తన పని ప్రదేశాలలో ఇతర జంతువులను ఉంచడానికి దూరంగా లేదు. 2000 వ దశకంలో ఒక గొప్ప చర్యలో, గూగుల్ ప్రధాన కార్యాలయంలో కలుపు మొక్కలు మరియు బుష్లను తగ్గించటానికి కంపెనీ మేకలను అద్దెకు తీసుకుంది.

Also Read: Mia Khalifa: పాకిస్తాన్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన మాజీ పోర్న్ స్టార్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

World Richest Man: ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ జెఫ్ బెజోస్..ఆయన ఆస్తుల ప్రస్తుత విలువ ఎంతంటే..

Latest Articles
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు