AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణం ఇదేః అశ్విని వైష్ణవ్

ప్రపంచం డిజిటల్ యుగం వైపు వేగంగా దూసుకుపోతోందన్నారు. టెక్నాలజీ విషయంలో భారత్‌కు చాలా అవగాహన ఉందన్న కేంద్ర మంత్రి, దీని ఫలితమే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కేవలం 5 గంటల్లోనే వెలువడ్డాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని.

News9 Global Summit: బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణం ఇదేః అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnav
Balaraju Goud
|

Updated on: Nov 21, 2024 | 11:46 PM

Share

దేశంలో యొక్క నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ TV9 యొక్క న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలో ప్రారంభమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘భారత్ – జర్మనీ సుస్థిర అభివృద్ధి కోసం రోడ్‌మ్యాప్’పై తన అభిప్రాయాలను సమ్మిట్‌లో వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, జర్మనీ – భారతదేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం తరపున, జర్మనీ ప్రజలను స్వాగతిస్తున్నానన్న మంత్రి.. గత ఐదేళ్లలో ప్రపంచం మూడు ప్రధాన ఇబ్బందులను చూసిందన్నారు. వీటిలో కోవిడ్, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వివాదం ప్రపంచ ప్రజలను కలవరానికి గురి చేసిందన్నారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, 2024 ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలను చూసిన సంవత్సరం. భారతదేశంలో కూడా ఆరు నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. భారతదేశంలో 968 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు. ప్రపంచం డిజిటల్ యుగం వైపు వేగంగా దూసుకుపోతోందన్నారు. టెక్నాలజీ విషయంలో భారత్‌కు చాలా అవగాహన ఉందన్న కేంద్ర మంత్రి, దీని ఫలితమే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కేవలం 5 గంటల్లోనే వెలువడ్డాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని.

మారిన గ్లోబల్ డిజిటల్ వాతావరణం మధ్య, భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం పెద్ద విషయమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు, పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. భారతదేశ ప్రజలు స్థిరత్వం కోసం ఓటు వేశారు. మోదీ పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు, భారతదేశం GDP పరంగా పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అప్పట్లో ప్రజలకు సంస్థలపై నమ్మకం తక్కువ. ఒక దశాబ్దంలో జిడిపి పరంగా భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మంత్రి అశ్విని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత కాలంలో మనం వేగంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్ చాలా బాగుంది. కోవిడ్ కాలం తరువాత, భారతదేశం పెట్టుబడులపై విశ్వాసం వ్యక్తం అవుతోందని తెలిపారు. స్వదేవీ పరిజ్ఞానంతో తయారవుతున్న వస్తువుల పట్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ పెరుతోందని, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి