AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: కువైట్‌లో కడప వాసికి ఉరిశిక్ష ఖరారు చేసే అవకాశం..? యజమాని కుటుంబం హత్య కేసులో..

Kadapa resident in Kuwait: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన కడప వాసి కువైట్లోని ఆర్దియా పట్టణంలో సేఠ్‌ అహ్మద్‌ (80) వద్ద పనికి కుదిరాడు. ఆయన వద్ద డ్రైవర్ పనికి చేరిన కడప వాసి వెంకటేష్..

Kadapa: కువైట్‌లో కడప వాసికి ఉరిశిక్ష ఖరారు చేసే అవకాశం..? యజమాని కుటుంబం హత్య కేసులో..
Death Sentence
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2022 | 9:31 PM

Share

Kadapa resident in Kuwait: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన కడప వాసి కువైట్లోని ఆర్దియా పట్టణంలో సేఠ్‌ అహ్మద్‌ (80) వద్ద పనికి కుదిరాడు. ఆయన వద్ద డ్రైవర్ పనికి చేరిన కడప వాసి వెంకటేష్.. ఇటీవల వ్యాపారితోపాటు ఆయన భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను హతమార్చాడు. ఇంట్లో దొంగతనం చేయబోతే యజమాని అడ్డుకోగా.. అందుకే చంపాడని పేర్కొంటున్నారు. అయితే.. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు ముందు కువైట్‌ వెళ్లాడు. ఆ తర్వాత మూడేళ్ల కిందట వెంకటేష్ కూడా కువైట్‌కు వెళ్లాడు. రెండేళ్ల తర్వాత తన భార్య స్వాతిని కూడా కువైట్ కు తీసుకువెళ్లాడు. అయితే.. వారం కిందటే తన ఇంటికి ఫోన్ చేసి పిల్లల క్షేమస మాచారాలు తెలుసుకున్న వెంకటేశ్.. ఇంతలోనే ఈ ఘటనకు పాల్పడ్డాడు.

కువైట్లో వారం రోజుల కిందట జరిగిన మూడు హత్యలు.. కడపజిల్లాలోని రాయచోటి పరిసర ప్రాంతాల్లో కలకలం రేపాయి. గత మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే నిందితుడిని కువైట్ ప్రభుత్వం ఉరి తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. వెంకటేష్ స్వాతిలకు జయవర్ధన్, విష్ణువర్ధన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిని తల్లీదండ్రులు శ్రీరాములు, రమణమ్మ వద్ద వెంకటేష్ వదిలివెళ్లాడు.

ఈ క్రమంలో కువైట్ పోలీసులు వారం క్రితం కడపకు ఫోన్ చేశారు. యజమాని, ఆయన భార్య కూతుర్లను కత్తితో వెంకటేష్ గొంతు కోసి చంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తన కుమారుడికి ఉరిశిక్ష పడుతుందన్న శ్రీరాములు వాపోతున్నాడు. అప్పులు పెరిగి పోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ నెల 6న చోరికి ప్రయత్నం చేసాడని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో అడ్డు వచ్చిన యజమానితో పాటు ఆయన భార్య, కుమార్తెలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు వెంకటేష్. ఈ నెల 7న సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ జైల్లో ఉన్నాడు. ఇంకా అధికారికంగా కువైట్ రాయబార కార్యాలయం నుంచి గానీ, జిల్లా పోలీసు శాఖకు గానీ సమాచారం అందలేదు. నిందితుడికి సంబంధించిన చిరునామా, వివరాలు బయటకు రాలేదు. మరోపక్క జిల్లా నుంచి కువైట్ కి వెళ్ళిన వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.

ఇక్కడ ఇంకేం పనిలేదని.. ఇండియాకు వెళ్లమంటూ కువైట్ పోలీసులు సూచించడంతో వెంకటేష్ భార్య స్వాతి స్వస్థలానికి చేరుకుంది. అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో పోలీసులు వెళ్లిపోమ్మన్నారని పేర్కొంంది. తన భర్తను ఉరితీస్తారని స్వాతి వాపోతుంది. అన్యాయంగా కేసులో ఇరికించారని.. ఎవరో చేసిన తప్పును తన భర్త పై వేసి ఉరితీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

అయితే.. దీనిపై తెలుగు వ్యక్తులు ఎంబసీని ఆశ్రయించారు. హత్యలు జరిగిన తీరుపై విచారించాలని కోరారు. అయితే.. ఈ వ్యవహారం కడప కలెక్టరేట్‌కు చేరింది. బాధితుడి భార్య స్వాతి వివరాలివ్వాలని కడప కలెక్టర్ స్థానిక పోలీసులను కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని స్థానిక రాజకీయ నాయకులు బాధితులకు హామీ ఇచ్చారు.

లాయర్ సహాయంతో ఈ నెల 10న కువైట్‌ నుంచి కడపకు వచ్చిన వెంకటేష్‌ భార్య స్వాతి.. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమిని కలిసి అసలు విషయం చెప్పింది. వెంకటేష్‌ను ప్రభుత్వం చొరవ తీసుకుని కాపాడి ఇండియాకు రప్పించాలని కలెక్టర్‌ వి.విజయకుమార్‌ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. స్పందించిన కలెక్టర్‌ ప్రభుత్వానికి, విదేశాంగశాఖకు వివరిస్తూ వినతిపత్రం రాశారు.

కువైట్‌లో ఉరిశిక్షలు చట్టబద్దమయ్యాయి. 2021 నాటికి మరణశిక్ష చట్టబద్ధమైంది. చాలా అరుదుగా మరణశిక్ష అమలు చేస్తారు. 2017లో చివరిగా ఉరిశిక్ష అమలు చేశారు. ఉరితోపాటు కొన్ని పరిస్థితులలో తుపాకితో కాలుస్తారు. కువైట్ పౌర చట్టం ప్రకారం మరణ శిక్షలు అమలు చేస్తారు. మరణానికి దారితీసే ఉగ్రవాదం, ప్రభుత్వ భవనాలు ధ్వంసం, అత్యాచారం, కిడ్నాప్, మాదకద్రవ్యాల రవాణ, గూఢచర్యం లాంటి కేసుల్లో ఉరి తీస్తారు.

కువైట్ లో న్యాయ విచారణ ఇలా..

న్యాయ సమీక్ష కోసం అప్పీల్ చేసుకోవచ్చు, కువైట్ కోర్టులో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాక అప్పీల్ కోర్టుకు వెళ్లవచ్చు, నేరం, కోర్టు సమీక్షించిన సాక్ష్యాలు, ప్రతివాది గత నేరారోపణల పై విచారణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ, అప్పీల్ కోర్టు ఈ అప్పీల్‌ను తిరస్కరిస్తే దేశంలోని అత్యున్నత కోర్టుకు వెళ్లవచ్చు, పాలక చట్టపరమైన సంస్థ అయిన కోర్ట్ ఆఫ్ కాసేషన్ (సుప్రీం కోర్ట్)కి వెళతారు, ఒకసారి దానిని సమీక్షించిన తర్వాత కువైట్ ఎమిర్ తప్పనిసరిగా శిక్షను ఆమోదించాలి, ప్రధాన న్యాయమూర్తి ఉరితీత ఉత్తర్వు జారీ, ఉరితీసే తేదీ, సమయం, స్థలం, పద్ధతిని చెబుతారు, ఉరితీశాక వారి డెడ్ బాడీని మీడియా కవరేజ్ కి అనుమతి ఇస్తారు.

Also Read:

AP Politics: పరిటాల అడ్డాలో హీటెక్కుతున్న రాజకీయం.. ధర్మవరంలో శ్రీరామ్‌కు పోటీగా మరో నేత..!

Andhra Pradesh: జంగారెడ్డిగూడెంలో వరుస చావుల కలకలం.. కొన్ని రోజుల వ్యవధిలోనే 18 మంది మృతి