AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: ఇక నుంచి చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలి.. కీలక నిర్ణయం తీసుకున్న జర్మనీ

చైనా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా ముందుకు సాగుతోంది. భారత్‌తో సహా చాలా దేశాలు ఇప్పటికీ చైనా వస్తువులపైనే ఆధారపడి ఉన్నాయి.

China: ఇక నుంచి చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలి.. కీలక నిర్ణయం తీసుకున్న జర్మనీ
China
Aravind B
|

Updated on: Jul 14, 2023 | 3:35 PM

Share

చైనా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా ముందుకు సాగుతోంది. భారత్‌తో సహా చాలా దేశాలు ఇప్పటికీ చైనా వస్తువులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా పారిశ్రామిక రంగానికి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ దేశ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకనేందుకు అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన జర్మని ప్రణాళికను సిద్ధం చేసింది. తాజాగా స్ట్రాటజీ ఆన్ చైనా పేరిట 40 పేజీల ఓ వ్యూహ పత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. అందులో ఇకనుంచి చైనాపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించుకునే దిశగా జర్మని అనుసరించాల్సిన నిబంధనలను వెల్లడించింది.

చైనా రాజకీయ నిర్ణయాలు, మార్పుల వల్ల తాము కూడా ఆ దేశ విషయంలో వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ వ్యూహపత్రంలో జర్మనీ తెలిపింది. చైనా తమ ప్రయోజనాలను రక్షించుకునేందుకు పనిచేస్తోందని.. అందుకోసం అంతర్జాతీయ రూల్స్ సైతం మార్చేందుకు యత్నించడం వల్ల ప్రపంచ భద్రతకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొంది. అయితే చైనాలో వ్యాపారం, పెట్టుబడులు కొనసాగిస్తూనే ఆ దేశంపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది జర్మనీ. ముఖ్యంగా లిథియం బ్యాటరీలు, ఔషధాలు, చిప్స్ తయారీ వంటి ఎన్నో రకాల ముడి సరకుల విషయంలో జర్మని తమ విధానాన్ని అమలుచేయనుంది. ఈ విషయంపై జర్మనీ ఛాన్సలక్ ఒలాఫ్ షోల్జ్ ట్విట్టర్‌లో స్పందించారు. తాము చైనా నుంచి విడిపోవాలనుకోవడం లేదని.. కానీ ముఖ్యమైన విషయాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఇదిలా ఉండగా 2022లో జర్మనీ, చైనా మధ్య 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!