AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangster Guilty: 33 హత్యలు చేసిన గ్యాంగ్‌స్టర్‌కు 1310 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆ జైల్లో వేల మందికి..

అత్యంత కిరాతకంగా 33 మందిని హత్య చేసిన డేంజరస్‌ గ్యాంగ్‌స్టర్‌కు అమెరికాలోని ఎల్‌ సాల్వెడార్‌లోని కోర్టు 1,310 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 90కిపైగా హత్యలకు..

Gangster Guilty: 33 హత్యలు చేసిన గ్యాంగ్‌స్టర్‌కు 1310 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆ జైల్లో వేల మందికి..
Gangster Guilty
Srilakshmi C
|

Updated on: Mar 15, 2023 | 7:42 PM

Share

అత్యంత కిరాతకంగా 33 మందిని హత్య చేసిన డేంజరస్‌ గ్యాంగ్‌స్టర్‌కు అమెరికాలోని ఎల్‌ సాల్వెడార్‌లోని కోర్టు 1,310 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 90కిపైగా హత్యలకు కుట్రలుపన్నడంతోపాటు అనేక భయంకరమైన నేరాలకు పాల్పడటంతో ఏకంగా శతాబ్ధాలపాటు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే..

అమెరికాకు చెందిన విల్మర్ సెగోవియా అనే కరడుగట్టిన నేరస్థుడు మారా సాల్వత్రుచా గ్యాంగ్‌కు చెందిన షల్టన్‌ సెల్‌ సభ్యుడు. ఈ గ్యాంగ్‌ను ఎమ్‌ఎస్‌-13 అని కూడా పిలుస్తారు. సెంట్రల్‌ అమెరికాలోని ఎల్‌ సాల్వెడార్‌లో ఈ గ్యాంగ్‌ ఎన్నో నేరాలకు పాల్పడింది. ఈ గ్యాంగ్‌కు చెందిన మరో నేరస్థుడికి ఇటీవల 945 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 22 హత్యలు, దాడులు, దోపిడీలకు పాల్పడ్డాడు. ఎమ్‌ఎస్‌-13లో ఏకంగా 60 వేల మంది గ్యాంగ్‌ సభ్యులు ఉన్నారు. ఈ గ్యాంగ్‌కు చెందిన వేలాడి నేరస్తులను ఎల్‌ సాల్వెడార్‌ ప్రభుత్వం తాజాగా మరొక మెగా జైలుకు తరలించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు నయీబ్‌ బుకెలే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

‘2 వేల మంది ముఠా సభ్యులను అమెరికాలోనే అతిపెద్ద జైలు అయిన దాదాపు 40 వేల సామర్థ్యం కలిగిన సెంటర్‌ ఫర్‌ ది కన్‌ఫైన్‌మెంట్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ (CECOT)కి తకలించాం. ఈ జైల్లోనే వారంతా శతాబ్ధాలపాటు శిక్ష అనుభవిస్తారని అథ్యక్షుడు తన పోస్టులో తెలిపారు. జైలులోకి వరుసగా ఖైదీలను తరలిస్తున్న వీడియోను కూడా బొకెలే ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో నేరస్తులు వరుసగా జైల్లోకి వెళ్లడం చూడొచ్చు. మరోవైపు ఈ వీడియోపై మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి దాదాపు 64 వేల మంది అనుమానిత ముఠా సభ్యులను అరెస్టు చేశారని, వారు దోషులుగా నిర్ధారించబడకముందే ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే