60 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడ్డ 7 ఏళ్ల బాలుడు, 24 గంటలు శ్రమించిన సహాయక సిబ్బంది
చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా బోర్ వెల్ బావిలో పడి చనిపోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా బోర్ వెల్ బావిలో పడి చనిపోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అందులో పడ్డ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. విశిదా జిల్లాలోని ఖేర్ కేడీ గ్రామంలో ఉంటున్న లోకేశ్ అనే ఏడోళ్ల బాలుడు మంగళవారం రోజున దాదాపు 60 ఫీట్ల లోతున్న బోరు బావిలో పడిపోయాడు. 43 ఫీట్ల లోతులో ఆ బాలుడు ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సహాయక బృందానికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న సిబ్బంది యంత్రాలతో తవ్వి బాలుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆక్సిజన్ పైపులు బావిలోపల వేసి, నైట్ విజన్ పరికరం ద్వారా బాలుడి కదలికల్ని గుర్తించారు. దాదాపు 24 గంటల తర్వాత సహాయక సిబ్బంది బాలుడ్ని బయటకి తీశారు.
అనంతరం బాలుడ్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తమ కుమారుడు తమకు దక్కుతాడనే తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. వైద్యులు అతడ్ని బతికేంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. చివరికి లోకేశ్ ఆస్పత్రిలోనే మృతిచెందాడు. కన్న కొడుకు బోరుబావిలో పడి చనిపోవడంతో వారి గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కూడా స్పందించారు. బాలుడు కుటుంబానికి 4 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే మంగళవారం రోజున మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లాలో ఓ ఐదేళ్ల బాలుడు కూడా ఇలానే బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 9 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది ఆ బాలుడ్ని బయటకు తీశారు. చివరికి అతను కూడా చనిపోవడం కలకలం రేపింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
