Arunachal pradesh: అరణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే, వెల్లడించిన అమెరికా

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చైనాకు, భారత్ కు ఉన్న వివాదం ఇంకా చల్లారలేదు. ఎప్పుడెప్పుడు భారత్ భూబాగాన్ని ఆక్రమించుకుందామా అని డ్రాగన్ ఎల్లప్పడు కుట్రలు పన్నుతూ ఉంటుంది.

Arunachal pradesh: అరణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే, వెల్లడించిన అమెరికా
Border
Follow us

|

Updated on: Mar 15, 2023 | 2:05 PM

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చైనాకు, భారత్ కు ఉన్న వివాదం ఇంకా చల్లారలేదు. ఎప్పుడెప్పుడు భారత్ భూబాగాన్ని ఆక్రమించుకుందామా అని డ్రాగన్ ఎల్లప్పడు కుట్రలు పన్నుతూ ఉంటుంది. అయితే తాజాగా అమెరికా ఈ విషయంలో భారత్ కు అనుకూలంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, ఇండియా మ‌ధ్య ఉన్న మెక్‌మోహ‌న్ లైన్‌ను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్న‌ట్లు అమెరికా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ భూబాగంలోనే ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశంపై ఇద్దరు సేనేట‌ర్లు తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ప్రస్తుతం ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, ఇలాంటి సమయంలో మిత్ర దేశంతో ఇండియాకు తోడుగా ఉండాల‌ని తాము భావిస్తున్న‌ట్లు అమెరికా సేనేట‌ర్ బిల్ హ‌గేర్టి తెలిపారు. అలగే సేనేట‌ర్ జెఫ్ మెర్క్లే కూడా తీర్మానం పాస్ చేసిన‌వారిలో ఉన్నారు.

లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్ వ‌ద్ద చైనా సైన్యం చేస్తున్న దుశ్చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని బిల్ హగేర్టీ తెలిపారు. ఇటీవల రెండు దేశా సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మెక్‌మోహ‌న్ లైన్‌ను అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుగా గుర్తిస్తున్న‌ట్లు స్పష్టం చేశారు. మరోవైపు పీఆర్‌సీ భూభాగంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఉన్న‌ట్లు చైనా చేస్తున్న వాద‌ల‌ను కూడా అమెరికా సేనేట్ తీర్మానం ఖండించింది. పీపుల్స్ రిప‌బ్లిక్ చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని నిలదీసింది. తమ దేశ భూభాగాన్ని పెంచుకునే ఆలోచనలతో ముందుకు వెళ్తోందని విమర్శించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం