AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pervez Musharraf Health: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత..

Pervez Musharraf: తీవ్ర అనారోగ్యంతో కొన్నాళ్లుగా దుబాయ్ లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..

Pervez Musharraf Health: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత..
Pervez Musharraf
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2022 | 5:45 PM

Share

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై ఆయన చనిపోయారంటూ పాకిస్తాన్ మీడియా బ్రేకింగ్ కథనాలను విడుదల చేసింది. దీంతో అంతర్జాతీయ మీడియా  ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది.  పర్వేజ్ ముషారఫ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1999 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం ఆయన 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచి అతను తన స్వదేశమైన పాకిస్థాన్‌కు తిరిగి రాలేదు. పాకిస్థాన్‌లో పర్వేజ్ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. విచారణను స్వదేశానికి రప్పించాలని కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసింది.

పాకిస్థాన్ మిలిటరీ జనరల్ పర్వేజ్ ముషారఫ్ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా సైనిక పాలన తీసుకొచ్చింది ఎవరు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారం నుంచి తప్పుకున్న తర్వాత పాకిస్థాన్‌ను వదిలి దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు.

అమిలోడోసిస్‌తో బాధపడుతున్న పర్వేజ్ ముషారఫ్

అమిలోడోసిస్ రియాక్ష‌న్‌తో ముష్ర‌ర‌ఫ్ బాధ‌ప‌డుతున్నార‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ అరుదైన వ్యాధి కారణంగా ముష‌ర్ర‌ఫ్ త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌లేక‌పోతున్నరని,నడవలేకపోతున్నారని తెలిపారు. ముషార్రఫ్ అమిలోడోసిస్ వ్యాధితో భాధపడుతున్నట్లు గతేడాది అక్టోబర్ లో APML ఓవర్సీస్ ప్రెసిడెంట్ అఫ్జల్ సిద్దిఖీ తెలిపారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఇదే వ్యాధి కోసం లండ‌న్‌లో ఆయ‌న ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.

నవంబర్-3,2007లో పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను మార్చి-31,2014న ముషార్రఫ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దీంతో మెడికల్ ట్రీట్మెంట్ కోసమంటూ 2016 మార్చిలో పాక్ విడిచి దుబాయ్ వెళ్లిన ఆయన తిరిగి పాక్ వెళ్లలేదు.

ఇండియా టుడ్ ఇచ్చిన సమాచారం మేరకు..