Smit Machchhar: హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను కలిసిన దుబాయ్ యువరాజు!
ఫ్లై దుబాయ్ ఇన్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మర్చర్ త్వరగా కోరుకోవాలని యాతవ్ ప్రపంచం అకాంక్షిస్తోంది. అయితే తాజాగా దుబాయ్‌లోని చికిత్స పొందుతున్న స్మిత్‌ను ఆ దేశ యువరాజైన హమ్దాన్ బిన్ మహమ్మద్ కలిశారు. ఆయన్ని పరామర్శించి.. దుబాయ్ ప్రజల తరుపున ఆయన దైర్య సాహసాలను ప్రశంసించారు.

ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం యూఏఈలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న యువరాజు.. ప్రమాద సమయంలో కెప్టెన్ వ్యవహరించిన తీరును కొనియాడారు.
170 మంది ప్రయాణికులు ఉన్న విమానంలో ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, అత్యంత ధైర్యసాహసాలతో, బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు గాను యూఏఈ ప్రజల తరఫున స్మిత్‌ను ప్రశంసించారు యువరాజు. యూఏఈ మానవత్వానికి, శాంతికి నిదర్శనమని స్పష్టం చేస్తూ.. కెప్టెన్ స్మిత్ తమ బృందంలో భాగమైనందుకు గర్విస్తున్నామని క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. అనంతరం స్మిత్‌ను కలిసిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ఫ్లై దుబాయ్ ప్రమాద ఘటన తర్వాత కెప్టెన్ స్మిత్‌పై యావత్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. క్లిష్ట సమయంలో ఆయన ప్రదర్శించిన తెగువ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం కెప్టెన్ స్మిత్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
During a visit to Captain Smit Machchhar… the flydubai pilot who embodied the highest degrees of courage, responsibility, and care for human life.
From us, and from the leadership of the nation, he has our full appreciation and praise.
We are proud that he is part of our… pic.twitter.com/QgpQxdcK5C
— Hamdan bin Mohammed (@HamdanMohammed) October 3, 2026
అసలు ఈ సంఘటన ఏంటి?
గత రెండ్రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు 170 మంది ప్రయాణికుల ఫ్లై దుబాయ్ కి Flight FZ1073 – Boeing 737 MAX 8 అనే విమానం బయల్దేరింది. అయితే ఫ్లైట్ కాస్త దూరంగా వెళ్లగానే.. కాక్‌పిట్‌లో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో భారత సంతతికి చెందిన ప్రధాన కెప్టెన్ స్మిత్ మచ్చర్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో సదరు కో పైలట్.. తన దగ్గర ఉన్న కత్తితో స్మిత్‌పై దాడికి పాల్పడ్డాడు.. అయినప్పటికీ.. స్మిత్ ధైర్యం కోల్పోకుండా.. అతన్ని అడ్డుకొని ఎలాగోలా.. కాక్‌పిట్ డోర్‌ను ఓపెన్ చేశాడు.. డోర్ ఓపెన్ అవ్వగానే రక్తపు మడుగులో ఉన్న పైలట్‌ను గమనించిన సిబ్బంది, అదనపు పైలట్స్ ఫ్లైట్‌ను టేకోవర్ చేసి..విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి, పెను ప్రమాదం నుంచి అందరి ప్రాణాలను కాపాడారు.
మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
