అక్కడ ఆవు పిడకలకు భలే డిమాండ్.. విషయం తెలిస్తే మీరు కూడా ఇక..
కలికాలం అంటే ఇదేనేమో.. ఫ్రీగా దొరికే వాటికి కూడా డబ్బు చెల్లించి కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. మొన్నటికి మొన్న మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికే వేప పుల్లలు.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కొనేపరిస్థితి దాపురించింది. తాజాగా ఇప్పుడు ఆవు పిడకలది కూడా అదే పరిస్థితి. మన దేశంలో ఏ గ్రామం వెళ్లినా.. ఆవు పేడ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు.. నిత్యం ఆవుపేడతో వాకిలి ముందు అలుకుతారు కూడా. ఇక ఇదే ఆవుపేడతో తయారు చేసే పిడకలు […]

కలికాలం అంటే ఇదేనేమో.. ఫ్రీగా దొరికే వాటికి కూడా డబ్బు చెల్లించి కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. మొన్నటికి మొన్న మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికే వేప పుల్లలు.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కొనేపరిస్థితి దాపురించింది. తాజాగా ఇప్పుడు ఆవు పిడకలది కూడా అదే పరిస్థితి. మన దేశంలో ఏ గ్రామం వెళ్లినా.. ఆవు పేడ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు.. నిత్యం ఆవుపేడతో వాకిలి ముందు అలుకుతారు కూడా. ఇక ఇదే ఆవుపేడతో తయారు చేసే పిడకలు కూడా విపరీతంగా ఉంటాయి. అయితే పట్టణాల్లో ఆవుపిడకలు కావాలంటే.. కాస్త ఇబ్బంది పడినా.. కొన్ని చోట్ల ఈ ఆవుపిడకల అమ్మకాలు ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ఈ ఆవుపిడకలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే మన దేశంలో కంటే ఎక్కువ ఇప్పుడు విదేశాల్లో వీటి డిమాండ్ పెరిగింది. అక్కడ ఏకంగా వీటిని ఆన్‌లైన్‌లోనే అమ్మకానికి పెట్టేశారు. అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో. ఆన్‌లైన్‌తో పాటుగా అక్కడి సూపర్ మార్కెట్లో కూడా ఆవు పిడకలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక ప్యాకెట్ ధర కేవలం రూ.215 మాత్రమేనట. అవి కూడా అందులో ఉండేవి 10 మాత్రమే. అయితే కొందరు ఈ ఆవుపిడకలకు సంబంధించిన ఫోటోలను తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్త వైరల్‌గా మారాయి.
దీంతో సోషల్ మీడియాలో ఆవుపిడకల ఫోటోలపై జోకులు పేలుతున్నాయి. అమెరికాలో ఈ ఆవుపిడకల వ్యాపారం భలే లాభసాటిగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పిడకల ప్యాకెట్ లేబుల్‌పై పెట్టిన క్యాప్షన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “ఇవి కేవలం పూజకు మాత్రమే వినియోగించేవి.. తినేవి కావు” అంటూ ఉంది. కాగా, ఇటీవల కొబ్బరి చిప్పలను కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది ఆమెజాన్. అంతేకాదు.. కేవలం రెండు కొబ్బరి చిప్పలను రూ.1400కి అమ్మి అందరికీ షాక్ ఇచ్చింది.