New York: అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పులు… దుండగుడి కాల్పుల్లో పోలీస్ సహా ఇద్దరు మృతి
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ ఇటీవల వరుస కాల్పులతో వణికిపోతుంది. ఏ దుండగుడు ఎక్కడి నుంచి కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మాన్‌హట్టన్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో పోలీస్ సహా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని...

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ ఇటీవల వరుస కాల్పులతో వణికిపోతుంది. ఏ దుండగుడు ఎక్కడి నుంచి కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మాన్‌హట్టన్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో పోలీస్ సహా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాన్‌హట్టల్‌ఓని ఓ భారీ భవంతిలోకి గన్‌తో చొరబడ్డ ఆగంతకుడు అక్కడ ఉన్న పోలీసులు, సాధారణ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకుని దుండగుడిని మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.
NFL ప్రధాన కార్యాలయం, హెడ్జ్ ఫండ్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో సహా అనేక ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాలు కలిగి ఉన్న మిడ్‌టౌన్ మాన్‌హట్టన్ ఆకాశహర్మ్యం లోపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. సంఘటన వద్దకు హుటాహుటిన ఆంబులెన్స్‌లు చేరుకుని గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించాయి. దుండగుడిని పట్టుకునేందుకు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతంలో అనేక ఫైవ్-స్టార్ హోటళ్లు, కోల్గేట్ పామోలివ్, KPMGతో సహా అనేక కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
కాల్పులపై న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ X లో స్పందించారు. మరణించిన అధికారి కుటుంబానికి తన “ప్రగాఢ సానుభూతిని” వ్యక్తం చేశారు.
I have been on scene at the shooting in Midtown, and we can report the shooter is neutralized.
The NYPD are now searching 345 Park Avenue carefully. If you are in the building, please stay where you are.
People have been shot and injured, and I will soon be going to the… pic.twitter.com/FYcOfuMxg6
— Mayor Eric Adams (@NYCMayor) July 29, 2025
