Sudoku Maki Kaji Died: మీకు సుడోకు గేమ్ గుర్తుందా..? దాని సృష్టికర్త మాకీ కాజీ కన్నుమూత
Sudoku Maki Kaji Died: మనం రోజూ పేపర్లనూ, ఆన్‌లైన్‌లో కనిపించే సుడోకు(sudoku) అనే గేమ్ గుర్తుందా..? 9 గళ్లు ఉంటాయి. ఓ మూడు, నాలుగు సంఖ్యలు ఇచ్చి పూరించమంటారు. ఆ పజిల్..
Sudoku Maki Kaji Died: మనం రోజూ పేపర్లనూ, ఆన్‌లైన్‌లో కనిపించే సుడోకు(sudoku) అనే గేమ్ గుర్తుందా..? 9 గళ్లు ఉంటాయి. ఓ మూడు, నాలుగు సంఖ్యలు ఇచ్చి పూరించమంటారు. ఆ పజిల్ సృష్టికర్త మాకీ కాజీ (69) కన్నుమూసినట్లు ఆయన కంపెనీ నికోలి వెల్లడించింది. ఆయన బైల్ డక్ట్ క్యాన్సర్‌తో మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మాకీ కాజీని సుడోకు గాడ్‌ఫాదర్‌గా పిలుస్తారు. చిన్నపిల్లల కోసం నంబర్స్‌తో పజిల్(puzzle)ని తయారు చేశారు. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నంబర్లను.. అడ్డం, నిలువుగా.. రిపీట్ కాకుండా ప్లేస్ చేశారు.
కాగా, కాజీ అక్టోబర్ 8, 1951న జపాన్‌లోని సపోరోలో జన్మించారు. సుడోపై ఆయన రాసిన పుస్తకం ప్రకారం.. అతని తండ్రి ఒక టెలికాం కంపెనీలో ఇంజనీర్, అతని తల్లి అక్కడి కిమోనో షాపులో పనిచేశారు. టోక్యోలో కాజీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాడు. కీయో విశ్వవిద్యాలయంలో డిగ్రీలో చేరి మధ్యలోనే మానేశారు. 1984లో నికోలి(nikoli) మ్యాగజైన్లో కాజీ కొత్త పజిల్‌ను ప్రవేశపెట్టాడు. అయితే అప్పట్లో అది అంత పాపులర్ కాలేదు. 1997లో హాంకాంగ్‌కు చెందిన ఓ రిటైర్డ్ న్యాయమూర్తికి జపాన్‌లోని ఓ పుస్తక దుకాణంలో ఈ కాజీ పజిల్ కనిపించింది. ఆ పజిల్‌కి అప్పుడే సుడోకు అని పేరు పెట్టారట. సుడోకు అంటే ఒకే సంఖ్య అని అర్థం. జపాన్‌లో 2011లో సునామీ అనంతరం ఓ వృద్ధుడు సుడోకు చాలా కష్టంగా ఉందని కాజీకి తెలియజేశాడంట. దీంతో వెంటనే సరళమైన సుడోకును పిల్లల కోసం కాజీ తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని 2017లో మీడియాతో పంచుకున్నారు.
2004లో ప్రాచుర్యం పొందిన సుడోకో:
అయితే 2004లో సుడోకో గేమ్ బాగా ప్రాచుర్యం పొందింది. తన పజిల్స్ గురించి ప్రచారం కోసం కాజి 30 దేశాల్లో పర్యటించారు. 100 దేశాల్లో 20 కోట్ల మంది సుడోకు ఛాంపియన్‌షిప్ ఆడుతున్నారు. నికోలి కంపెనీకి కాజి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. కాగా, టోక్యోలోని మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో మాకి కాజి క్యాన్సర్‌తో పోరాడుతూ వారం కిందట తుది ప్రాణాలు విడిచారు. కాజికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్యే అంత్యక్రియలను పూర్తి చేసినట్లు నికోలి కంపెనీ పేర్కొంది.