AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను తీసుకువచ్చిన చైనా.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!

China: ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను అమలు చేస్తోంది చైనా. ఇంట్లో జంటలు వేర్వేరుగా పడుకోవాలని, ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దని, భోజనం కూడా విడిగానే చేయాలని..

China: ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను తీసుకువచ్చిన చైనా.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!
Subhash Goud
|

Updated on: Apr 08, 2022 | 5:48 AM

Share

China: ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని ఓ కొత్త రూల్‌ను అమలు చేస్తోంది చైనా. ఇంట్లో జంటలు వేర్వేరుగా పడుకోవాలని, ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దని, భోజనం కూడా విడిగానే చేయాలని అధికారులు ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. దీంతో అధికారులపై గరం గరం అవుతున్నారు అక్కడి ప్రజలు. అయితే, ఈ నిబంధన కూడా కరోనా కట్టడికే అని అధికారులు చెప్పడం కొసమెరుపు. కరోనా కేసులు తగ్గాలని కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్‌ విధించారు చైనా అధికారులు. కానీ, వైరస్‌ (Virus) సోకిన దానికంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు షాంఘై ప్రజలు. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మార్చి చివరి వారంలో ప్రకటించింది చైనా. రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ (Lockdown) ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో ఇక్కడ లాక్‌డౌన్ విధించలేదు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా షాంఘై (Shanghai )నగరంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయని వాపోతున్నారు అక్కడి ప్రజలు.

ప్రభుత్వం డ్రోన్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఒక డ్రోన్‌ ప్రత్యక్షమై కోవిడ్‌ నిబంధనలు పాటించండి. స్వేచ్ఛ కోసం మీ మనస్సులో నిండిన కోరికను నియంత్రించుకోండి. కిటికీలు తెరవకండి.. పాడకండి అంటూ ఓ నెటిజన్‌ డ్రోన్‌ ప్రకటన వీడియోను షేర్‌ చేశారు. అంతేకాకుండా  ఈ రాత్రి నుంచి ఇంట్లో ఉన్న జంటలు వేర్వేరుగా పడుకోండి.. ముద్దులు, కౌగిలింతలు వద్దని, భోజనం చేసే ముందు కూడా విడిగా కూర్చోండి అంటూ వీడియోను పోస్టు చేశారు.

ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కిరాణా సామాన్ల కోసం కూడా బయటకు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో, బుధవారం నాడు సుమారు 20 వేల కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో ఇది కొత్త రికార్డు కావడం గమనార్హం. అటు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని అక్కడి అధికారులు కూడా అంగీకరించారు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు షాంఘై ఆఫీసర్లు. సోమవారం లాక్‌డౌన్‌ను నిరవధికంగా పొడిగించారు. నిబంధనల ప్రకారం, ఆహారం, నీళ్లు ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ, డెలివరీ సర్వీసులకు ఎడతెరిపి లేకుండా ఆర్డర్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహారం, మంచి నీరు ఏదీ ఆర్డర్ చేయలేకపోతున్నామని వాపోయారు ప్రజలు. షాంఘైలో లాక్‌డౌన్ చైనాపై, ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

China Corona

ఇవి కూడా చదవండి:

Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!

Pakistan Political Crisis: మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!